బాలకాండము
సర్గము 58.
వసిష్ఠుని నూర్గురు పుత్రులు తిరస్కరించి శపింపఁ ద్రిశంకుఁడు విశ్వామిత్రుని శరణు వేఁడి యజ్ఞమును జరిపింపు మని వేఁడుకొనుట. | ||
కం. | విని యా త్రిశంకు మాటలు ముని పుత్ర శతమ్ము రాజ పుంగవుఁ గని ప ల్కె ననూన రోష సంభృత మనో నికాయమ్ము తోడ మనుజవరేణ్యా! | 1. |
తే.గీ. | సత్యవాది కా దని యన చనునె రాజ యేల దాని మీఱుచు నిట్లు నితర మార్గ ములు వెతకు దీవు మాతండ్రి ముఖము లన్న గౌరవమ్ము పాటింపవె కపట బుద్ధి | 2. |
కం. | గతి యిక్ష్వాక్వన్వయ భూ పతుల కిలఁ బురోహితులె యవార్య గురువులున్ నుత సత్యవాదుల నృపుల కతిక్రమింపఁ దర మగునె యావం తైనన్ | 3. |
ఉ. | శక్యము కాదనంగ ముని సత్తముఁ డప్పుడు రాజసత్తమా! వాక్యము లెన్న కా క్రతువుఁ బన్నుగఁ జేయఁ దరమ్మె మాకు నా ధిక్యము నూని యేఁగుమ త్వదీయ పురమ్మున కింకఁ దాన యౌ శక్యుఁడు జన్నముల్ సలుప క్ష్మాపతి కోటికి ముజ్జగమ్ములన్ | 4. |
కం. | నరవర జన్నము నీకు నొ నరించి నీ పల్కిన విధి నయ మెంచ కెదన్ గురువున కవమానమ్మును దరమే చేయంగ మాకు దారుణ రీతిన్ | 5. |
చం. | అన విని కోప వాక్యముల నద్ధరణీపతి యంతఁ దిర్గి యి ట్లనె వచనమ్ము లారసి సుతాలి వసిష్ఠుఁడు మీరు నన్నుగా దని రిట నింక నేఁ జనుదు నన్యునిఁ గోరఁగ మీకు భద్రమై తనరును గాక సంతతము తాపస పుంగవు లార నా ననెన్ | 6. |
మ. | విని యా పల్కులు తాపసాత్మజు లహో బీరమ్ముగా పల్కగం గనలం బంది భృశమ్ము చిత్తముల ధిక్కారమ్ము నోర్వంగ లే క నరాధీశు శపించి యాక్షణమ యీ కాంతుండు చండాలుఁడై మను గాకంచును బల్కి వారు నిజ సద్మం బేఁగి రొక్కుమ్మడిన్ | 7. |
కం. | కడవఁగ రాతిరి యంతం దడయక చండాలుఁ డయ్యె ధాత్రీ పతియే పుడమి సురల శాపమ్మును గడవం దరమే మహీశ గణమున కెంచన్ | 8. |
తే.గీ. | నీల వస్త్ర ధరుం డయ్యె నీల కాయుఁ డయ్యె జుట్టు చెదరె బూది యలమి యుండెఁ గాటి దండ లమరె మేనఁ గాంచనమ్ము వోయి కలిగె నంత నినుప భూషణములు | 9. |
తే.గీ. | కాంచి చండాల రూపుని మించి పర్వు లిడిరి విడిచి మంత్రులు పౌరు లింక రాజ భటులు ననుయాయు లెల్లరు భయము తోడ వేగముగ దశ దిశలకు వింత రామ! | 10. |
తే.గీ. | ఒక్కఁడె మహాత్ముఁడు నృపతి యోర్పు నూని నెమ్మి రేలు బవళ్లు చని చని చేరె దహ్యమానుఁ దపోనిధి సాహ్య మరసి రాజ ఋషిని విశ్వామిత్రు రఘువరేణ్య! | 11. |
కం. | కనఁ జండా లాకృతు హత మనోరథు ధరాధినాథు మౌనీంద్రునకున్ ఘనతరముగ విశ్వామి త్రునకుం గారుణ్య మడరెఁ దూర్ణమ్ము మదిన్ | 12. |
కం. | దయ తోడ మహాతేజుఁడు నయవిదుఁ డా ధార్మికుండు నరనాథుం గాం చి యనియె వాక్యములు వికృత మయిన శరీరు నృప! భద్ర మగు నీ కనుచున్ | 13. |
తే.గీ. | వచ్చిన పని యదేమి నృవర యయోధ్య కుం బతివి బల్లిదుండ! శాపంబున నయి తీవు చండాలుఁడవు వసుధావరా! ప లుకు మభీతిని నంచుఁ బలుకఁగ నంత | 14. |
మ. | విని యా వాక్యము లా నరేంద్రుఁడు మహా వీరుండు చండాలుడున్ వినయుండై వడి మోడ్చి హస్తముల నావేశంబునం బల్కె రా ణ్ముని వీక్షించి తిరస్కృతుండ నయితిం బుత్రాలిచే నొజ్జ చే తను నా కోర్కెను బొంద నైతి విపరీతం బయ్యె నా కక్కటా | 15. |
తే.గీ. | దివికి సశరీర మేఁగ మునివర! నాదు వాంఛితము సుమ్ము సేసితి వంద క్రతువు లింపుగఁ దమి వాని ఫలమ్ము నెన్నఁ డేనిఁ గాంచ నేర విశ్వామిత్ర! కొంచె మైన | 16. |
ఆ.వె. | అనృత మేను మున్ను మునివర పలుక లే దింకఁ బలుక నేర నెట్టి కష్ట ము లెదు రైన నేమి పలుకను నీ మీద నొట్టు రాజ ధర్మ ముంచి యెడఁద | 17. |
తే.గీ. | జన్నములు పెక్కు చేసితిఁ గన్న బిడ్డ ల వలెఁ బ్రజల రక్షించితి లాలనమునఁ బెద్ద లెల్లరు నా శీల వృత్త మరసి యంతరంగమునఁ గనిరి సంతసమ్ము | 18. |
ఆ.వె. | ధర్మ మనుసరించి తాపసేంద్ర! క్రతువు సేయ నెంచఁగఁ గమనీయముగను నాదు గురువు లకట మోద మంద రనుజ్ఞ నీయ రేమి యందు నెందుఁ జనుదు | 19. |
కం. | దైవ బలం బది గొప్పది కేవల మానవ బలమ్ము గిట్టును వమ్మై దైవంబే పరమపు గతి దైవం బది యాక్రమించు ధరణిని నెల్లన్ | 20. |
తే.గీ. | అట్టి యార్తుండ నన్నిఁక నిట్టి తఱిఁ బ్ర సాదమును గోరు వానిని నాదరించి తేర్పఁ దగు దీవు రాజర్షి! దేవ నిహతు నింక భద్ర మగును గాక యెలమి నీకు | 21. |
కం. | ఇతరంపుఁ బ్రాపుఁ జేరను గతి లే దన్యమ్ము నాకుఁ గౌశిక యింకన్ వితత పురుష యత్నమ్మున సతతము దైవకృతముఁ దగ శమియింప వలెన్ | 22. |
ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నేఁబది యెనిమిదవ సర్గము.
బాలకాండము
సర్గము 59.
త్రిశంకునిచే యజ్ఞము జరిపింప నెంచి విశ్వామిత్రుఁడు సక లాధ్వరులను మునులను విప్రుల నాహ్వానింప నాజ్ఞాపింప నెల్ల రచటకు నేతెంచుట, మహోదయునితోఁ గూడి వశిష్ఠ పుత్రులు పరుష వచనము లని తిరస్కరింప వారిని విశ్వామిత్రుఁడు శపించుట. | ||
కం. | నృపు మాట లెల్లఁ దా విని కృపతోఁ గుశికాత్మజుండు కృత దృఢ చిత్తుం డు పలికెఁ జండా లాకా ర పురేశునితో మధురతరమ్ముగ రామా! | 1. |
తే.గీ. | స్వాగతము నీకు వత్స! యైక్ష్వాక నిన్నె ఱుఁగుదు ధార్మిక! నే శర ణగుదు రాజ పుంగవ! భయమ్ము వలదింకఁ బుణ్య చరిత! చిత్త మందు నించుక యేని నిత్తఱి నని | 2. |
చం. | మునులను బుణ్య కర్ములను భూవర యాగ సహాయ విప్రులన్ ఘనముగ నాచరింప నవికారత యాగము నిప్డు పంచి తె త్తును గురు శాప కల్పితపు దుస్సహ రూప శరీర యుక్తముం జనెదవు హస్త లభ్య మగు స్వర్గము చేర శరణ్యు నన్నిటన్ | 3. |
చం. | పలికి మహాత్ముఁ డట్లు తన ప్రాజ్ఞ కుమారులఁ బంచె వస్తు కో టులు సవ నార్థ మన్నిటిఁ గడుం గడు వేగమ కూర్ప స్వీయ శి ష్యులఁ బిలిపించి పంపెను యశోధనులం గొని తే సశిష్య మౌ నుల శ్రుతి విజ్ఞ ఋత్విజులనుం జెలికాండ్ర నిజాజ్ఞఁ దెల్పుచున్ | 4. |
ఆ.వె. | ఎవ్వ రేని యాలకించి నా యీ వచ నమ్ము లెద్ది పల్కిన నది యెల్ల గౌరవమ్ము సూపక పలికినవి యెల్లఁ జెప్ప వలయు నాకుఁ దప్పకుండ | 5. |
తే.గీ. | గురువు నాజ్ఞను దలఁ దాల్చి కూర్మి నేఁగి రెల్ల దిశలకు వేదజ్ఞు లెల్ల వేగ తిరిగి వచ్చి యంతఁ దిరిగి దేశదేశ ములు సమీపించి రెల్లరు మునివరేణ్యు | 6. |
కం. | చేరి కలసి వా రెల్లరు నా రాజర్షిన్ జ్వలిత మహా తేజస్విన్ ధారుణి నరసిన శ్రుతి చయ పారంగతుల నుడు లెల్లఁ బల్కిరి మునితో | 7. |
కం. | విని మునివరేణ్య మీ గిర లను వచ్చుచు నుంటిరి సకల ద్విజ వరులుం జనుదెంచి రెల్ల దేశము ల నుండి రానట్టి వాఁ డల మహోదయుఁడే | 8. |
తే.గీ. | రోష మూని వసిష్ఠ పుత్రు లగు నూర్వు రనిన యట్టి పల్కుల నన్నిటిని వినుండు క్షత్రియుండు చండాలుఁడు కాఁగ యాజ క యజమానులు హవిఁ గొందురె యిల సురలు | 9. |
తే.గీ. | బ్రాహ్మణులును విశ్వామిత్రు పంచఁ జేరి కుడిచి చండాలు నింటను గుడుపు నకట యందఁ గలవారె స్వర్గము నంద ఱెంచ బాగు బాగని పల్కిరి వ్యంగ్యముగను | 10. |
తే.గీ. | ఎల్లరు వసిష్ఠ నందను లల్ల యా మ హోదయునిఁ గూడి నిష్ఠుర మైన వాక్య ములను రోషమ్మున మునీంద్ర! పలికి రచట నరుణ పూరిత నేత్రులు దరమె నుడువ | 11. |
ఆ.వె. | అట్లు వార లంద ఱన్నవి యాలకిం చి మునిసుతుల నుడులు చెన్ను మీఱి నట్టి కన్ను దోయి బిట్టదరఁ బలికె గాధిపట్టి యలుకఁ గఠినముగను | 12. |
కం. | ఉగ్ర తప మందు నిల్చి స మ గ్రాదుష్టపుఁ జరిత్ర మసలెడు వానిన్ నిగ్రహు నను దూషింతురె యాగ్రహమున దుష్టులు మసు లౌదు రశంకన్ | 13. |
ఆ.వె. | నేఁడు కాలు నిల్లు తోడికొని చనంగఁ గాలపాశ మహిమ జాలి కొలుప జనువు లేడు నూర్ల సంతతమును బీనుఁ గు గమి కూడు వీరు కుడుచు చుండ్రు | 14. |
కం. | వికృతులు విరూప తను లై సకల సుతులు శునక మాంస సంభోజనులై యకృపఁ జరింత్రు సతము ము ష్టికా కులము నందుఁ బుట్టి చిత్రముగ నిలన్ | 15. |
ఉ. | నన్ను ననిందనీయుని ఘనమ్ముగ నింద యొనర్చె దుష్టుఁడై క్రన్నన నా మహోదయుఁడు గర్వి జగమ్ముల దూషితంబుగా నున్న నిషాద వంశమున నుర్వి జనించును గాక నిక్కువం బిన్నర లోక పాంసనుఁడు హీన చరిత్రఁ జరించు నిత్యమున్ | 16. |
తే.గీ. | పరుల ప్రాణ ఘాతకుఁడై కృపా విహీనుఁ డై చరించును జిరకాల మతఁడు దుష్ట వర్తనమ్మున నాదు కోపంపుఁ బెంపు వలన నమ్మహోదయుఁడు కపటపు బుద్ధి | 17. |
కం. | మునుల నడుమ నిల్చి తపో ధన విశ్వామిత్రుఁడు ఘనతర తను తేజ స్వి నుడుల నివ్విధి నని యా పెను బల్కులు కౌశికుండు పెనుకోపముతో | 18. |
ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నేఁబది తొమ్మిదవ సర్గము.
బాలకాండము
సర్గము 60.
విశ్వామిత్రుఁడు త్రిశంకుని స్వర్గమునకుఁ బంప నింద్రాది సురులు వెనుకకుఁ బంపఁ బ్రత్యేక స్వర్గమును సృష్టించి దేవతలను సమ్మతింపఁ జేసి యందు నతని నిల్పుట. | ||
కం. | తనదు తపో బలమున హత మొనరించి ఘనుఁడు మహోదయునితో ముని నం దన శతము నెల్లఁ గౌశికుఁ డనియెను మునుల నడుమను మహా తేజుఁ డిటుల్ | 1. |
మ. | ఇతఁ డీశుండు త్రిశంకు నామ విభుఁ డా యిక్ష్వాకు దాయాదుఁడే నుత ధర్మిష్ఠ వదాన్యుఁడే కదిసి నన్నున్ భక్తినిం గోరె నా తత రక్తిన్ శరణమ్ము కోరి త్రిదివస్థానమ్ము దేహమ్ముతోఁ గ్రతువుం జక్కఁగ నాచరించుటకు భూకాంతుండు నమ్రుండునై | 2. |
తే.గీ. | ఈతఁడు సశరీరము దివి కేఁగు నట్లు తగెడు యజ్ఞము నొకదానిఁ దనరి మీరు నన్ను గూడి యారంభింపఁ బన్నుగ నిట నుద్యమింపుఁడు మునులార హృద్యముగను | 3. |
కం. | విని యా విశ్వామిత్రు వ చనములు ధర్మజ్ఞులు ముని సత్తము లంతన్ మినుకులు ధర్మ యుతమ్ముల ననిరి కలసి యెల్లరు తగ సాలోచనులై | 4. |
తే.గీ. | కుశిక దాయాదుఁ డీతఁడు కోప ముండు మెండుగ జ్వలి తానల సన్నిభుం డితండు నుడివి నట్టి కార్యముఁ జేయ నొప్పు మనకుఁ జేయకున్న శపించు నమేయముగను | 5. |
చం. | కనుక త్రిశంకుఁ డేఁగఁగ సకాయము కౌశికు తేజపుం బల మ్మున దివి కింపుగం గ్రతువు పూని యొనర్పఁగ నుద్యమింపుఁడీ యని మును లెల్ల కార్యముల నందఱు సేయఁ దొడంగి రింపుగా ననల నిభుండు తాపసుఁడు యాజకుఁ డయ్యెను గౌశికుం డటన్ | 6. |
తే.గీ. | ఋత్విజులు మంత్ర కోవిదు లెల్ల రపుడు క్రమముగఁ బను లడర యథోక్తముగఁ గల్ప సమ్మతముగ మంత్రమ్ములు చదువుచు జరి పించి రా యజ్ఞరాజము నంచితముగ | 7. |
కం. | చిరకాలమునకు సంయమి వరుండు భాగములను గొన వర మంత్రములన్ సుర వరుల నెల్లరఁ బిలిచెఁ బరమానందమ్ము తోడఁ బావనుఁ డంతన్ | 8. |
ఉ. | పిలిచిన స్వీయ భాగములు పేర్మి గ్రహింపఁగ దేవతా గణ మ్ముల నకటా నొకండును నపూర్వ మనంగను రాక యున్నచో నలిగి కరమ్ము మౌనివరుఁ డంత సృవమ్మును మించి యెత్తి తాఁ బలికెఁ ద్రిశంకుఁ గాంచి యటఁ బల్కుల నివ్విధి సంభ్రమమ్మునన్ | 9. |
తే.గీ. | స్వార్జితమ్మగు నా తపోబలము నిపుడు రాజ కనుమ పంపుదు శరీరమ్ము తోడ నిన్ను దివమున కింపుగ నిజ శరీర మరుగుమ దురాపము దివికి నరవరేణ్య! | 10. |
ఆ.వె. | కొంచె మైన నున్న సంచితంపుఁ దపః ఫ లమ్ము నాకు స్వార్జితమ్ము దాని తేజ మూని నీవు దివి కేఁగుమ సశరీ రమ్ము రాజ! సంశయమ్ము లేక | 11. |
కం. | అనఁగ ముని యివ్విధము నిజ తను సహితం బేఁగె దివికి ధరణీ పతియే మును లెల్లఁ గాంచు చుండగఁ గనుల కొసఁగుచుఁ గడు విందు కాకుత్స్థ వరా! | 12. |
ఆ.వె. | దేవ లోక మందు దేవేంద్రుఁడు త్రిదశ గణము తోడ నుండి కని త్రిశంకుఁ బలికె రాఁగ నిట్లు వచనమ్ముల నలుక కానిపింప నిజ ముఖమ్ము నందు | 13. |
తే.గీ. | స్వర్గ మిది నీకు కాదు వేశ్మమ్ము నిలువఁ బొమ్ము తిరిగి త్రిశంకు వేగమ్ముగ గురు శాప హతుఁడవు కనలేవు చదలు మూఢ! నేలఁ గూలుమ తల క్రింద నెగడ నీవు | 14. |
ఆ.వె. | పలుక నింద్రుఁ డిట్లు పడెను దిరిగి యా త్రి శంకుఁ డంతఁ గావు శరణ మంచు వేఁడి కొనియెఁ గరముఁ భీతి విశ్వామిత్రు నా తపోధనుని ధరాధిపతియె | 15. |
తే.గీ. | అఱచు వాని యార్తుని పల్కు లాలకించి కౌశికుఁడు తాపసుండు భూకాంతుఁ గాంచి రోష మూని భృశమ్ము పల్కులను రాజ! నిలు నిలు మనుచుఁ బల్కెను నీరజాక్ష! | 16. |
ఉ. | దక్షిణ దిక్కులో ఋషుల ధాత పరుం డన వెల్గి యేడ్వురన్ దక్షత నిల్పి యన్యులను దాపస సత్తముఁ డింక నింపుగా నక్షయ రీతి నభ్రమున నంత సృజించె వ రాన్య తారలన్ దక్షిణ దిక్కు నందుఁ దగఁ దాపసు లెల్లరు చూచు చుండఁగన్ | 17. |
మ. | తగ సృష్టించి సరోష చిత్తుఁడు మహా తారాళి గాధేయుఁడే పగ మీఱం బలికెం బురందరుఁ బరున్ భవ్యున్ సృజింతున్ వడిన్ జగమం దింద్రుఁడు లేనిచోఁ దగదు నా సంరంభియై దేవతా సు గణం బెల్ల సృజింపఁగాఁ దొడఁగెఁ దాఁ జోద్యంపు టుద్యోగియై | 18. |
తే.గీ. | అంతఁ గలవర మంది సురాసుర స మ హర్షి సంఘములు పలికె సానునయ వ చనము లడలి విశ్వామిత్ర సంయ మీంద్రుఁ జేరి వినయ మతిశయిల్ల శీఘ్ర గతిని | 19. |
తే.గీ. | ఈతఁడు గురు శాపక్షతుఁ డిద్ధ చరిత! మునిగణారాధ్య! సశరీరము దివి నుండ నర్హుఁ డరయఁ గాఁ డెన్నఁడు నవధరింప నర్హుఁడవు నీవు పరికింపు మాత్మ లోన | 20. |
కం. | విని యా దేవత లందఱి వినయంపు వచనము లెల్ల విశ్వామిత్రుం డు నిఖిల సుర గణముం గని మునిపుంగవుఁ డిట్టు లనియె ముఖములు శుభముల్ | 21. |
ఆ.వె. | మేని తోడ దివికి నే నంపెద నని ప లికి నృపవరు తోఁ బలుకఁగ ననృత మెట్లు తగును నాకు నెవ్విధి నైనను భద్ర మగును మీకు పరమ సురులు! | 22. |
తే.గీ. | స్వర్గ మగుఁ గాక సతము త్రిశంకున కిది యుండు సశరీర మిచ్చట యుండు నా యొ నర్చినట్టి నక్షత్ర గణమ్ములెల్ల శాశ్వతమ్ముగ వెలసి యీ విశ్వ మందు | 23. |
తే.గీ. | ఎంత వఱకు లోకము లుండు నంత వఱకు నుండు నివి యెల్ల భాసిల్లుచుండి భృశము నా సృజించి నట్టివి యెల్ల నో సురవరు లార యర్హులు మీరెల్ల ననుమతింప | 24. |
కం. | అన విశ్వామిత్రుఁ డిటులఁ జను నట్టుల సంయమీంద్ర! చక్కఁగ నింకన్ విను నిల్చు నెల్ల నంతట ఘన భద్రము నీ కనె సురగణ మా మునితో | 25. |
తే.గీ. | గగన మందు నక్షత్ర నికాయ మెల్లఁ బరఁగు వైశ్వానర పథము బయటఁ దార ల నడుమ త్రిశంకుఁడు వెలుంగు ఘనుఁడ! యమర సముఁడు తల క్రిందుగ నమరి సమ్మదమున | 26. |
తే.గీ. | కీర్తి మంతుఁ గృతార్థునిఁ గృత విలసిత తార లెల్ల ననుసరించు ధరణి పతిని స్వర్గ లోక మేఁగిన వాని చంద మలరి నిత్యము ప్రభల తోడ మునివర గణ్య! | 27. |
ఆ.వె. | సకల సురులు మునులు సన్నుతింప భృశము ముని మహాత్ముఁ గౌశికుని ముదమ్ము వడసి తృప్తిఁ జెంది పరమర్షి యమరులఁ గాంచి మంచి దనెను గరము ప్రీతి | 28. |
కం. | పన్నుగ సమాప్తమై చన జన్నమ్ము మహాత్ములు మునిచయమున్ సురలుం గ్రన్ననఁ దాపస వర్యులు నెన్ని తొలుతఁ జేరిన గతి యేఁగిరి రామా! | 29. |
ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నఱువదవ సర్గము.
బాలకాండము
సర్గము 61.
అంబరీషుని యజ్ఞాశ్వము నింద్రుఁ డపహరింప ఋచీక ముని పుత్రుఁడు శునశ్శేఫుఁడు తన్ను యాగ పశువుగా నంబరీషునకు సమర్పించుకొనుట. | ||
కం. | తా నరుగు ఋషులఁ గానన మౌనివ్రాతమ్ముఁ గాంచి మాన్యచరిత్రా! మౌనిప విశ్వామిత్రుఁడు వీనుల కింపుగఁ బలికెను వీరవరేణ్యా! | 1. |
తే.గీ. | దక్షిణ దిశ మనకుఁ గల్గెఁ దద్ద విఘ్న మిట్లు కాన నేఁగెద మింక నితర దిశకు నెల్లరము సమ్మదమ్ముగఁ బెల్లుగఁ దప మాచరింతము నిశ్చింత వే చని యట | 2. |
ఆ.వె. | పశ్చిమమునఁ గలదు పరమ తపోవని పుష్కర మనఁగ ఘనముగ విశాల మైనది తప మచట నందఱ మింపుగ నాచరింప నగు మహాత్ములార! | 3. |
కం. | పలుక మహాతేజుఁడు వా ర లా మహా మునులు పుష్కరమ్మునఁ దినుచున్ ఫలములు నంచిత మూల మ్ము లుగ్ర మతి దుర్భర తపమున నిల్చి రటన్ | 4. |
శా. | ఆ కాలమ్మున నంబరీషుఁడె యయోధ్యా నాథుఁ డిష్టిన్ ధరం జేకూరంగ నమేయ లాభములు సచ్ఛీలుండు సేయం దమిం బాకారాతి ప్రయాగపుం బశువు నశ్వశ్రేష్ఠమున్ దొంగిలెన్ వే కాపట్యమునన్ వచించిరి నృపున్ వీక్షించి విప్రోత్తముల్ | 5. |
తే.గీ. | అపహృతం బయ్యె రాజేంద్ర! యాగపశువు నీదు దుర్నయ మక్కట పాదుకొనఁగ రక్ష నీయంగఁ జాలని రాజు నతని దోషములు నశింపఁగఁ జేయుఁ దూర్ణముగను | 6. |
చం. | నృవర వరేణ్య గొప్ప దగు నిష్కృతి దీనికిఁ జేయ నొప్పగున్ సవనపుఁ గార్య సంచయము సాగెడు కాలము మించకుండఁగన్ నృవరునిఁ గాని యప్పశువునిం బదిలమ్ముగఁ గాంచుమీ వడిన్ హవ ఫలితమ్ము నెంచి మది నట్టుల భూవర! యుద్యమింపుమీ | 7. |
తే.గీ. | ఒజ్జల పలుకులను విని యజ్జనపతి బుద్ధిమంతుఁ డన్వేషించె భూతలమున యాగపశువు నరు సహస్ర గోగణముల నీయ నరుదెంచు వాని నరేంద్రవర్య! | 8. |
కం. | ఆ యా దేశము లూరులు నా యా నగరమ్ములు వను లాశ్రమ తతులున్ వేయేల నన్నియు వెదక నా యవనీపతి విరివిగ నయ్యై యెడలన్ | 9. |
కం. | కనె నా రాజు సదార స తనయ ఋచీక మునిని భృగు ధాత్రీధర మం దు నవనిసురుఁ గూర్చుండఁగ నిన వంశాంభోధి సోమ! యింపారంగన్ | 10. |
తే.గీ. | కని నమస్కరించి వడసి కరుణఁ బుడమి భర్త తేజస్వి రాజర్షి బ్రహ్మఋషిని నిజ తపఃప్రభా దీప్త మునివర ముఖ్యు సంతసముగ క్షేమ మడిగి సర్వులకును | 11. |
ఆ.వె. | లక్ష గోవులకు వరసుతుని భార్గవ! పశువు గాఁగ యజ్ఞ వరము నందు నమ్మఁ దలఁచినన్ మహాభాగ! కృతకృత్యు నౌదు నే నని ముని నడిగె నతఁడు | 12. |
కం. | తిరిగితి దేశము లెన్నియొ వర యజ్ఞార్థమ్ము గాంచఁ బశువు మునీంద్రా! కరుణ నొక సుతుని నిమ్మా విరివిగఁ గొని మూల్య మింత విప్రవరేణ్యా! | 13. |
కం. | నరనాథుం డన నవ్విధిఁ బరమర్షి ఋచీకుఁ డనియెఁ బార్థుని తోడన్ గురుతేజుఁడు యగ్ర తనయు ని రాజవర విక్రయింప నేరను జుమ్మీ | 14. |
కం. | విని పతి గిరల విమలముల జనని తపస్విని నరవర శార్దూలుని గాం చి నలినదళ నేత్ర తగు వ చనమ్ములు వలికె నొకింత చంచల మతినిన్ | 15. |
చం. | పలికెనె యమ్మ లే ననుచు భార్గవుఁ డాతని పెద్ద బిడ్డనున్ వల పది చంటి బిడ్డ పయిఁ బార్థివ మెండగు నాకుఁ గావునన్ వలవదు విక్రయింప మఱి వానిని నే శున కాఖ్యు నెవ్విధిం దలఁపఁగఁ దండ్రి కగ్రజుఁడు తల్లికిఁ బ్రీతి కనిష్ఠుఁ డిద్ధరన్ | 16. |
కం. | విని తల్లిదండ్రుల పలుకు ల నా శునశ్శేఫుఁ డంత రామ! స్వయముగా ననె మధ్యమ నందనుఁడు వ చనమ్ము లివ్విధి నొకింత సంతాపమునన్ | 17. |
తే.గీ. | తండ్రి పలికె జ్యేష్ఠుని నమ్మఁ దగ దని నృప! తల్లి యమ్మ ననెఁ గనిష్ఠ తనయు భూప! విక్ర యార్హుఁడు మధ్యముఁ డా క్రమమున నన్నుగొనిపొమ్ము రాజేంద్ర! జన్నమునకు | 18. |
ఆ.వె. | లక్ష యాల నొసఁగి రాజన్యుఁ డా శున శ్శేఫునిఁ గొని చనెను శీఘ్రముగను ముద మెడంద మీఱఁ బూర్ణ మనోరథుఁ డయ్యె నట్లు రఘుకులాబ్ధి సోమ! | 19. |
కం. | తగ నంబరీషుఁడు ముద మ్ముగ రాజర్షభుఁడు త్వరితము శునశ్శేఫున్ సుగుణాత్ముని ముని నందను నిఁ గొని రథమ్మునఁ జనియెను నీరజ నయనా! | 20. |
ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నఱువది యొకటవ సర్గము.
బాలకాండము
సర్గము 62.
విశ్వామిత్రుఁడు తన కుమారులను శపించి శునశ్శేఫునకు మంత్రముల నుపదేశించి కాపాడి తిరిగి తప మాచరించుట. | ||
కం. | నుత కీర్తి యంబరీషుం డతని శునశ్శేఫుఁ గూడి యరిగి యరిగి భూ పతి మధ్యాహ్నమునకు రఘు పతి! పుష్కర తటికిఁ జేరి పడసె నవరతిన్ | 1. |
ఆ.వె. | విశ్రమించు చుండఁ బృథివీపతి యశస్వి ముని కుమారుఁడు కరము వగ పున్న యతఁడు పుష్కరమ్ము నందు విశ్వామిత్రు మేనమామ సర్షి మౌనిఁ గాంచె | 2. |
తే.గీ. | దప్పియు నలసట యతని ముప్పిరిగొన ముఖము వెలవెలఁబాఱఁగ ముని సుతుండు సంకటమున విశ్వామిత్రు నంకతలము నఁ బడి తత్క్షణంబ పలికె గుబులు తోడ | 3. |
కం. | జనకుఁడు లేఁడు మునీంద్రా! జననియు లే దకట సౌమ్య! జ్నాతులు చుట్టా లును లేరు నాకు ధర్మ మ్ము నరసి రక్షింపు మీవ పుణ్యాత్మ! ననున్ | 4. |
చం. | నలుగుర కీవ త్రాతవు ఘనమ్మగు బంధువు తాపసేంద్ర! యా వలఁ గృతకృత్యుఁడై నృపతి పన్నుగ భాసిలు నట్టు లింక నే నిలను జిరాయువుం బడసి యింపుగఁ జేసి తపమ్ము లుత్తమ మ్మల దివి కేఁగి సౌఖ్యముల నందెడు రీతిగఁ బ్రీతిఁ జూడుమా | 5. |
తే.గీ. | నాథుఁడవు నీవ నాకు ననాథున కగు మ కృపఁ జూపి నా పయి భవ్యమానసమునఁ బుత్ర వరుఁ గాంచు జనకుని బోలి ధర్మ చిత్త రక్షింపు నన్ను విపత్తు లందు | 6. |
కం. | విని విశ్వామిత్ర మహా ముని యా గిర లనునయించి ముని పుత్రుఁ దగం దనయుల వీక్షించి పలికె మినుకులు ధర్మ సహితము లమేయము లంతన్ | 7. |
| ||
కం. | పరలోక హితమ్ము శుభము లరసి సుతులఁ దండ్రు లేల యవనిఁ దమి సృజిం తురొ యక్కాలమ్ము తగం బరఁగె నిపుడు పుత్రులార పన్నుగఁ గనుఁడీ | 8. |
కం. | శరణము నన్నీ బాలుఁడు వరముని పుత్రుండు వేఁడెఁ బరమప్రీతిం గరుణను మే లీతని కిట జరుగఁగ జీవితము నిండు సత్పాత్రునికిన్ | 9. |
తే.గీ. | మంచి పనులు చేయుదు రెల్ల రంచితముగ ధర్మరతులు మీరెల్లరు ధరణి లోన యాగపశువుగ రాజున కచట కేఁగి తృప్తి పఱచుఁ డగ్ని నడరి హృద్యముగను | 10. |
ఆ.వె. | నాథవంతుఁ డగు శునశ్శేఫుఁడు క్రతు వ విఘ్న మగును సురలు ప్రీతిఁ జెందఁ గలరు నాదు వచనములు నిజము లగును బుత్ర వర్యు లార! పూనుకొనుఁడు | 11. |
మ. | విని యా పల్కులు తండ్రి యట్టు లనఁగన్ విభ్రాంత చేతస్కులై యని రంతన్ వచనమ్ము లివ్విధి మధుష్యందాది పుత్రుల్ మదిం దనరన్ దర్పము లీల తోఁపఁ గరముం దండ్రిన్ సమీపించి వే వినయం బించుక లేక వర్తనములన్ బీరమ్ముగా నెల్లరున్ | 12. |
ఆ.వె. | స్వీయ సుతులఁ దండ్రి! వీడి పరుల పుత్రు ల కిడఁ దివిరి నీదు రక్షణం బ కార్య మనుచుఁ దోఁచుఁ గాంచ మాకు శునక మాంస మన్న మందు మరగు నట్లు | 13. |
కం. | కొడుకు లనిన మాటలు విని యడరిన కోపమున నెఱ్ఱ నయి కన్నులు మం డెడి నిప్పును బోలి కనం బడఁ బలుకఁ దొడంగె నిట్లు పల్కులు రామా! | 14. |
కం. | భయ మించుక లేక భృశ మ నయములు రోమాంచపు వచనమ్ము లకట మీ ర యతిక్రమించి నా నుడు లె యంటి రిట్లేమనఁ దగు నెల్లర మిమ్మున్ | 15. |
తే.గీ. | కుక్క మాంసమ్ము తిను జాతి నక్కజముగఁ బుట్టుఁ డింక వాసిష్ఠులఁ బోలె ధరణి వేయి యేండ్లు పూర్ణమ్ము జీవించు చుండి సంచరింతురు గాక నిస్సంశయముగ | 16. |
ఆ.వె. | శాప మిచ్చి యిట్లు సంయమీంద్రుఁడు నిజ నందనులకు నార్తున కభయమ్ము నిచ్చి పలికె నిట్టు లెలమి శునశ్శేఫుఁ గాంచి తీర్ప బాధఁ గౌశికుండు | 17. |
తే.గీ. | ఎఱ్ఱ చందన మద్ది మే నెఱ్ఱ బట్ట లు తొడిగి పవిత్ర పాశములు తగిలించి కట్ట యూపమునకు నిన్ను బట్టి! యిట్టి పల్కు లగ్నితో నింపుగఁ బల్కు మడరి | 18. |
తే.గీ. | రెండు దివ్యంపు గాథలు లీలఁ బాడు మంబరీషుని యజ్ఞము నందు వీని దానఁ బొందఁ గలవు సిద్ధి తథ్యముగను బలికి యిచ్చెఁ దా నా మంత్రములను బ్రీతి | 19. |
తే.గీ. | మంత్రములను గ్రహించి సమాహితంపు మది శునశ్శేఫుఁ డా రెంటిఁ గదిసి రాజ సింహు నంబరీషు ఘనుని శీఘ్రముగ వ చించె నివ్విధి ముని సుతుఁ డంచితముగ | 20. |
ఆ.వె. | రాజసింహమా! పరమ సత్వ! శీఘ్ర మేఁ గెదము నీదు యజ్ఞ సదసుఁ జేర దీక్ష నూన వలయుఁ దివిరి నిర్వర్తింపు కార్య తతుల నెల్ల నార్య! యడరి | 21. |
కం. | అలసత్వము లేక నృపతి పలుకు లతం డనఁగ వేగఁ బయనం బయ్యెం జెలఁగ మహానందము మది లలిత క్రతువాటిక కవిరామం బంతన్ | 22. |
ఆ.వె. | ఈయ నా సదస్యు లెల్ల ననుజ్ఞ నె ఱ్ఱని వలువలు పూతలను నలఁది ప విత్ర లక్షణునిగ వే చేసి యతని బం ధించె యూప మందు మించి రాజు | 23. |
తే.గీ. | బంధితుం డయి యుత్తమ వాక్కుల ముని సుతుఁడు తనియఁ జేసెను మునిపతి నుడివిన యట్టి రీతి నింద్రుని వాని యనుజు మంత్ర యుగ్మమున నా శునశ్శేఫుఁ డుచిత రీతి | 24. |
కం. | ప్రీతి వడసి దేవేంద్రుం డాతని గుప్తస్తుతులఁ జిరాయువు నొసఁగెన్ వీతభయ శునశ్శేఫున కా తఱి నాశ్చర్యముగ నినాన్వయ వర్యా! | 25. |
ఆ.వె. | పూర్తి చేసి యజ్ఞమును భూపతి పురంద రుని ప్రసాద మలర రుచిర ఫలము లు బహు గుణము లందెను బురుషపుంగవా! యంబరీషుఁ డంత సంబరముగ | 26. |
కం. | ముని విశ్వామిత్రుండును ఘన ధర్మపరాయణుండు కౌశికుఁ డంతన్ వన మా పుష్కర మందున్ సనియతి వేయేండ్లు తపము సల్పెను రామా! | 27. |
ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నఱువది రెండవ సర్గము.
బాలకాండము
సర్గము 63.
విశ్వామిత్రుఁడు వేయి సంవత్సరములు తిరిగి తపస్సు చేయ బ్రహ్మదేవుఁడు మెచ్చి ఋషిగ గుర్తింప నింకను దప మాచరించు చుండ నప్సరస మేనకును గాంచి దశ వర్షము లామెతోఁ గూడి యుండి తపో భంగపుఁ బశ్చాత్తాపమునఁ దిరిగి ఘోర తపము చేయ బ్రహ్మ మహర్షి పదవి నిచ్చినను దిరిగి తపము చేయుట. ఇంద్రుఁడు భీతిల్లి రంభను బంప నెంచుట. | ||
కం. | పూర్ణము కా వే సమ ల భ్యర్ణము జేరిరి మునికిఁ దపః ఫల మిడ సౌ వర్ణ ప్రభా విలసిత కృ పార్ణవ సురు లజునిఁ గూడి యానందమునన్ | 1. |
ఆ.వె. | నలిన సంభవుండు పలికె విశ్వామిత్రుఁ జేరి మధుర గిరలు స్వీయ కర్మ ముల శుభముల భద్ర మలరు స్వార్జితముగ నైతి వీవు ఋషివి యాదరముగ | 2. |
ఆ.వె. | త్రిదివ మేఁగెఁ బలికి దేవేశుఁ డివ్విధిఁ దిరిగి యంతఁ దపము తిరిగి గాధి జుండు చేయఁ దొడఁగెఁ జుమ్మి విశ్వామిత్ర ముని ఘనతర తేజుఁ డనల నిభుఁడు | 3. |
కం. | దివసమ్ములు కొన్ని చన న తివ మేనక యచ్చర దమిఁ దీర్థం బా పు ణ్యవిశేష పుష్కరమ్మున కు వచ్చి తా స్నాన మాడఁ గోమలి నృవరా! | 4. |
ఆ.వె. | కాంచె నప్సరసను గాధి సుతుఁడు మహా తేజుఁ డభ్ర మందు దీపితంపు మెఱపు వంటి దాని మేనక నసమాన రూప నచట ముని వరుండు ప్రీతి | 5. |
చం. | కని మద నాతు రాత్ముఁ డయి కౌశికుఁ డామెను మేనకా సతిన్ ముని వృషభుండు పల్కె రతి ముద్దియ! స్వాగత మప్సరోమణీ! తనరి మదాశ్రమ ప్రచుర ధామ నివాసము నెంచుమా మదిం గొను దయ నంగ జార్తు నను గొమ్మరొ! నీ కగు భద్ర మింపుగన్ | 6. |
చం. | అన విని చేసె వాస మట నచ్చర యన్నుల మిన్న యింపుగం జనె నివసింప నప్సరస చక్కఁగ వర్ష దశమ్ము లచ్చటన్ ఘనముగ సంతస మ్మలరఁ గౌశికు నాశ్రమ మందు రాఘవా! యనవరతమ్ము సౌఖ్యముల నవ్వనితా మణి ముంప సంయమిన్ | 7. |
మ. | చనినం గాలము సిగ్గు గల్గ మది విశ్వామిత్రుఁ డుద్వేగియై ఘన చింతా కలి తాంతరంగుఁడు మహా కామాంధతా తప్తుఁ డై తినె యే మందుఁ దపంపు భంగమున కీ దేవాలి కౌటిల్యమే కన నిక్కార్యము నాఁ దలంచి మదినిం గాకుత్స్థ రోషమ్మునన్ | 8. |
ఉ. | రేలు దివమ్ము లెల్లఁ జన లీల గతించె దశాబ్దముల్ వడిం గ్రాలితిఁ గామ మోహమునఁ గల్గెను ఘోరపు విఘ్న మివ్విధిం గాల వశుండ నైతి నని కౌశికుఁ డార్తిని నిశ్వసించి తా నా లలితాంగి భీతిలుచు నంజలి నుండగఁ గాంచి యచ్చరన్ | 9. |
తే.గీ. | తియ్యని పలుకులు పలికి దేవ కాంత మేనకను విడనాడెను దా నరిగెను గుశిక వంశజుఁ డుత్తర దిశపుఁ బర్వ తమున కంత రఘువరేణ్య! తాపసుండు | 10. |
ఆ.వె. | పూని నైష్ఠికంపు బుద్ధి జయింపఁ గా మమ్ము నిఁక యశస్వి నెమ్మిఁ జేరి కౌశికీ తటి వడిఁ గౌశికుం డొనరించె ఘోర తపము దా నకుంఠితమ్ము | 11. |
ఆ.వె. | అంత వర్షములు సహస్రము లతి ఘోర ముగ నుదీచి గిరిని ముని వరేణ్యుఁ డడరి తపము సేయ నాదిత్యులకు భీతి కలిగె మిక్కుటముగఁ గలఁత రామ! | 12. |
తే.గీ. | చేరి సుర లందఱును ముని శ్రేణిఁ గూడి తలఁచి రివ్విధముగ సమ్మతమ్మ చుమ్మి యిచ్చిన మహర్షి పద మిఁక నీతనికిఁ గు శిక తనూజున కీ ముని శ్రేష్ఠున కని | 13. |
కం. | విని దేవతల పలుకు లె ల్లను లోక పితామహుండు బ్రహ్మ ముదం బా ర నలినజుఁడు విశ్వామి త్రుని తోడఁ దపస్వితో మధురముగ ననియెన్ | 14. |
ఆ.వె. | స్వాగతమ్ము సుత! మహర్షి! మెచ్చితి నీ త పమ్మునకు మహత్వ పదము ఋషుల నీ కొసఁగితి నేను నెమ్మినిఁ గౌశిక! సంతసింపు మింక చింత వీడి | 15. |
ఆ.వె. | సంతసమ్ము గాని చింత యేనియు సుంత కౌశికునకు లేదు కమల గర్భు మాటల విని నంత మాన్య మహర్షికి సర్వ లోక విభు వచనము లయిన | 16. |
కం. | అంజలి ఘటించి నతు లిడి కంజునకుఁ బితామహునకు గౌరవ మొప్పన్ మంజు వచనమ్ములఁ గుశిక సంజాతుఁడు పల్కె నిట్లు సంయమి వరుఁడే | 17. |
తే.గీ. | స్వీయ శుభకర్మముల గ్రహించితి నతుల మ హర్షి శబ్ద మనఁగ దేవ యనుకొనంగఁ దగునె యింద్రియములను నేఁ దగ జయించి తి నని చిత్తము హర్షింపఁ దెల్లముగను | 18. |
కం. | అనఁ గాదని బ్రహ్మ పలికి మునివరుతోఁ దప మొనర్పుము మునీంద్ర! జయిం ప నెడఁద నెంచినఁ దథ్యము గను నీ యింద్రియముల నని కంజుం డేఁగెన్ | 19. |
కం. | చన నలువ సుర గణము తో డను విశ్వామిత్ర ముని యడరి యాధార మ్మును లేక యూర్ధ్వ బాహుం డు ననిల మానుచుఁ దపము పటువుగాఁ జేసెన్ | 20. |
చం. | నిలఁబడి యేను వహ్నులకు నిత్యము మధ్య నిదాఘ వేళలన్ నిలఁబడి నింగి క్రిందుననె నిత్యము వారక వాన వేళలన్ సలిలము నందు నిల్చి తమిఁ జక్కఁగ రే పవ లెల్ల సీతునం జలిపెను వేయి యేం డ్లటులు సంయమి ఘోర తపమ్ము వింతగన్ | 21. |
కం. | ముని విశ్వామిత్రుఁడు తప ము నప్పగిదిఁ జేయ ఘోరముగ గలవర మ య్యెను సురగణమ్మునకు నిం ద్రునకు భృశమ్ముగ నపుడు సరోరుహ నయనా! | 22. |
కం. | కని యప్సరసను రంభను ఘనులు మరుత్తుల యుతము నగద్విషుఁ డనియెన్ మినుకులు హితమ్ములు సురల కు నహితములు కౌశికునకు గుబులు చెలంగన్ | 23. |
ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నఱువది మూడవ సర్గము.
బాలకాండము
సర్గము 64.
ఇంద్రు నాజ్ఞఁ దపోభంగము సేయ వచ్చిన యప్సరస రంభను జిరకాలము శిలగాఁ బడియుండ మని శపించి యొక విప్రోత్తమునిచే శాప విమోచన మగు నని యనుగ్రహించుట, తిరిగి వేయేండ్లు ఘోరముగాఁ దప మొనరింప దీక్ష వహించుట. | ||
కం. | అమర శుభ కార్యము గలదు విమలా! రంభా! మునీంద్రు విశ్వామిత్రున్ భ్రమపఱచి కామమోహ వ శమందుఁ గూల్ప వలయుఁ జుమి సముచిత రీతిన్ | 1. |
కం. | సుత్రాముని పల్కులు విని యాత్రమ్ముగఁ బ్రాంజలి యయి యచ్చర లజ్జన్ గోత్రారితోఁ బలికె మృగ నేత్ర ప్రతి వచనము లిట్లు నీరజనేత్రా! | 2. |
కం. | సురనాథ! యీ మహాముని వర విశ్వామిత్రుఁ డూను బరమామర్ష మ్మరయంగ నన్ను నవ్విధి నరయను సందేహ మిందు నావం తైనన్ | 3. |
కం. | అదియే నా భయ మమర గ ణ దేవ! వేధించుఁ గరము నన్నిట మది లో న దయం జూపుమ నా పయి సుదతి యనఁగ భీతి నిట్లు సురపతి రామా! | 4. |
కం. | కని రంభ నంజలించిన వనిత భృశార్తను నగారి పలికెను భద్ర మ్ము నరయుదు భీతిలకు నుడి విన కార్యమ్ము నొనరింపు ప్రీతిని రంభా! | 5. |
ఆ.వె. | మనసును హరియింపఁ దనరు కోకిల రూప మున వసంత వేళ ముసురఁ జారు తరువుల నడుమ నల మరుఁ డుండ నా తోడ నీదు చెంత నుందు నీరజాక్షి! | 6. |
ఆ.వె. | అందమైన రూప మడరఁ జేసి వెలుఁగు లీన నీవు పరమ ఋషినిఁ జేరి కౌశికునిఁ దపః ప్రకాశుని భేదింపు తపము రంభ! మూరి తరళనయన! | 7. |
ఆ.వె. | అవ్వచనములు విని యత్యుత్తమంపు రూ పము ధరించి రంభ వదన మందు నవ్వలరఁగ నంత నాతి విశ్వామిత్రు లోభపఱుపఁ జాగె శోభఁ జూపి | 8. |
తే.గీ. | మధుర మైన కోకిల కంఠ మంజు సుస్వ నమ్ములు వినిపింప నిజ మనమ్ము రంజి లంగఁ గరము విశ్వామిత్రుఁ డంగన నటఁ గాంచెఁ గన్నులు తెఱవంగఁ గట్టెదుటను | 9. |
ఆ.వె. | సంశయమ్ము కలిగె సన్మునికి విని నం త మధురస్వన ముచితంపు గాన మింక రంభ యునికి యంకము నందట్టు లరయ డెంద మందు నబ్బురముగ | 10. |
కం. | ఎఱిఁగి సహస్రాక్షుని యా వెఱ పెఱుఁగని దుష్కృతమ్ము విశ్వామిత్రుం డఱిముఱిఁ జెలంగఁ గోపము తఱచై యా రంభ కొఁసగెఁ దగు శాపమ్మున్ | 11. |
తే.గీ. | ఇల జయింపఁ గామక్రోధములను గోరు పురుషు లోభపఱుప నెంతువు నను నీవు రంభ! దుర్భాగ్యురాల! శిల వయి నిల్తు వింక వేయేండ్లు ధాత్రిని శంక లేక | 12. |
ఆ.వె. | విప్రుఁ డొకఁడు లోక వినుత తపస్వి మ చ్ఛాప దూషిత నిను జామ! యుద్ధ రించు నంత రంభ! యంచితముగను ద పోబలమ్ము చేత ముదము నొసఁగ | 13. |
కం. | అని యిట్లు మహాతేజుఁడు ముని విశ్వామిత్రుఁడు మనమున క్షోభించెం దన కోప మాపఁ జాలని తనముం జింతించి యంతఁ దద్ద రఘువరా! | 14. |
ఆ.వె. | పెద్ద ఱాయి యయ్యెఁ బెను శాపమున రంభ విని ముని గిర లెల్ల వెఱచి మన్మ థుండు దేవపతియుఁ దూర్ణ మేఁగిరి నిజా లయములకుఁ బరుగున రఘువరేణ్య! | 15. |
తే.గీ. | కోపమున మహాతేజుని కుశికపుత్రు తపపు హరణపుఁ గతన సంతప్తుఁ డయ్యె నమ్ముని యజితేంద్రియుఁ డయ్యె నంత నిజ మ నమ్మున నశాంతుఁ డయ్యెను జుమ్మి రామ! | 16. |
ఆ.వె. | పోవ నిజ తపమ్ము మునిప విశ్వామిత్రుఁ డెడఁదఁ జింత నంది యెన్నఁ డలుగ నింక నెన్నఁ డేని నేను బలుక కుందు నంచు నిశ్చయించి యాతఁ డింక | 17. |
ఆ.వె. | తలఁచె మఱియు నిట్లు దా నూపిరిఁ గొనక వంద యేండ్లయినను బరఁగి యింద్రి య జయ మరయ నెంచి యంగమును గృశింపఁ జేయు చుందు నంచుఁ జింత తోడ | 18. |
తే.గీ. | బ్రాహ్మణత్వము నేఁ బొందు వఱకు స్వార్జి త తపము వలన శ్వాస నింతయును దీయ కయు నశన మింతఁ గుడువక కాల మెంత గడచినను నిల్చి యుందును గాఢ ధృతిని | 19. |
తే.గీ. | తపములో నుండ క్షయము నొంద వవయవము లెల్ల నావి యని తలఁచి యింపుగ వెయి యేండ్లు దీక్ష నుండఁ బ్రతిన నెలమిఁ జేసెఁ గౌశికుఁడు మునీంద్రుఁడు రామ! కఠినముగను | 20. |
ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నఱువది నాల్గవ సర్గము.
బాలకాండము
సర్గము 65.
విశ్వామిత్రుఁడు వేయేండ్లు ఘోరమైన తపము సేసి జితేంద్రియుఁడై బ్రహ్మదేవునిచే బ్రహ్మర్షి పదవి నంది వసిష్ఠని చే సమ్మతింపఁ జేసికొని తపము చాలించి వసిష్ఠునిఁ బూజించుట. జనకునిచేఁ బూజింపఁబడి రామలక్ష్మణులతో వసతిగృహమున కేఁగుట. | ||
కం. | శీతాద్రి దిక్కు వదలి మ హా తాపసి కౌశికుఁడు వరైంద్రికిఁ జని రా మా! తపము దారుణమ్ముగ వీతామర్షమ్ము సేసె విద్యోతముగన్ | 1. |
కం. | మౌనము నూని సహస్ర స మా నిచయము ఘోరముగ సమంచిత బుద్ధిం దా నాచరింపఁ జాగె న హో నిష్ఠఁ దపము మునివరుఁ డుత్సాహముగన్ | 2. |
ఉ. | నిండఁగ వేయి యేండ్లు మునినిం గృశునిం గడు పెద్ద విఘ్నము ల్మెండుగ నావహించినను గ్లేశము నొందఁడు దా నొకింతయున్ దండిగ నిశ్చయించి మది దారుణ మైన తపంపు దీక్షలో నుండును సంతతమ్మును మహోన్నత మానస ధీవరుండునై | 3. |
తే.గీ. | ఆతని సహస్ర వర్ష వ్రతాంత మందు నన్న మింత విశ్వామిత్రుఁ డాన నెంచి యున్న తరుణమ్ము నందు రఘూత్తమ! యరు దెంచి యన్నము ద్విజుఁ డయి యింద్రుఁ డడిగె | 4. |
ఉ. | అన్నము సిద్ధ మైనది ధరామరుఁ గాంచి యొసంగె ధీరతం గ్రన్నన శేష మించుకయుఁ గానక యుండెఁ దపో విశిష్ట సం పన్నుఁ డభుక్తుఁడై మఱియుఁ బల్కఁడు విప్రుని తోడ నెద్దియుం బన్నుగ నూనె మౌనమును శ్వాసను వీడి సహస్రవర్షముల్ | 5. |
తే.గీ. | విరహి తోచ్ఛ్వాసు తల నుండి వెల్వడుచును ధూమరాశి వ్యాపించెను ద్యో తలమ్ము నందు నెల్లెడ ముజ్జగ మందు మంట పెట్టి నట్లు భీతిఁ గొలుప బెట్టిదముగ | 6. |
తే.గీ. | దేవ రాక్షస గంధర్వ దివ్య పన్న గోర గాదులు నిజ కాంతు లాఱ మోహి తు లయిరి తపః ప్రభావ మతులము పరఁగ మూరి నజునితోఁ బల్కిరి ముఖము లిట్లు | 7. |
ఆ.వె. | చూప నాశ లడరి కోపింప యత్నింపఁ బెక్కు భంగు లకట వీస మైన దోస మెద్ది తోఁపదు మునీంద్రు నందుఁ ద పమ్ము వృద్ధి సెందుఁ బమ్మి కరము | 8. |
కం. | పాపము సుంతయు మునిలో తోఁపదె యీ కున్నఁ గోర్కి దుస్సహ తపమే యోపును లోకమ్ముల నౌ రా పరిమార్ప సచరాచరము నిక్కముగన్ | 9. |
చం. | కన దిశ లెల్లఁ దప్తములు కాంతి విహీనము లయ్యె నక్కటా యనయము గాంచ క్షోభితము లంబుధు లన్నియు మిక్కుటమ్ముగన్ ఘనముగఁ బృథ్వినిం జెలఁగెఁ గంపనముల్ గతి నేర కుంటిమే యనిలము వీచె నుద్ధతిని నబ్జజ! నాస్తికు లుద్భవింతురో | 10. |
తే.గీ. | ప్రజలు ముల్లోకముల యందు వ్యాకులమున మూఢు లట్టుల నున్నారు గాఢ మైన తపపుఁ గాంతి సూర్యుని కాంతి తగ్గె నకట పద్మసంభవ! మునివరు ప్రభలు మించె | 11. |
తే.గీ. | అగ్ని రూపుఁడు ప్రభ లందు నాత్మఁ దలఁచు వఱకు సర్వనాశ మొనర్ప వాని నింపు గా ననుగ్రహింప నిపుడు కార్య మగును దేవ! యిమ్మహామునిని గాధి సుతు నెలమి | 12. |
కం. | మును ముల్లోకములం గా ల్చిన కాలాగ్ని వలెఁ కాల్పఁ జెల్లును జుమ్మీ ముని దేవ రాజ్య మడిగిన ను నీయఁ దగుఁ గౌశికునకు నుత సంయమికిన్ | 13. |
కం. | అంత నలినజుని మున్నిడి చెంతకుఁ జేరి యమరులు కుశిక నందనుతో నంత మరసి తపమునకున్ సంతసమున దియ్యనౌ వచనము లని రిటుల్ | 14. |
ఆ.వె. | స్వాగతమ్ము నీకు బ్రహ్మర్షి! యానంద మాయె భృశము మాకు నంది తీవు పరమ తపపు మహిమ బ్రాహ్మణ్య మిప్పుడు స్వార్జితముగ నింక సముచితముగ | 15. |
తే.గీ. | ఇత్తు దీర్ఘాయువును బ్రాహ్మ ణేంద్ర! యీ మ రుద్గణమ్ములఁ గూడి సురుచిర భద్ర మగును బొందఁ గలవు స్వస్తి యరుగు మింక సౌమ్య! సుఖముగ వలసిన చంద మెలమి | 16. |
కం. | పలుకులు పితామహునివి స కల దేవతలవి విని ముని కౌశికుఁ డెద లో నలరి మిగుల వందనములు పలికి యరసి వారి ననియె వచనము లిట్లున్ | 17. |
మ. | అన మీ రిట్టులు నాకు దక్కె నని బ్రాహ్మణ్యమ్ము దీర్ఘాయువుం ఘన వేదమ్ములు సమ్మతించునె వషట్కారమ్ము నోంకారముం గనుఁడీ యవ్విధి నుండు నట్టుల దయన్ క్షాత్రశ్రుతి బ్రహ్మ వే ద నికాయజ్ఞుఁడు నా వసిష్ఠుఁడు ననుం దా నట్లుఁ బిల్వం దగున్ | 18. |
ఆ.వె. | శాంతిపఱుప నమరు లంత వసిష్ఠుఁడు ముని వరుండు కౌశికుని సమీప మునకు వచ్చి స్నేహముం జేసి పలికె బ్ర హ్మ ఋషి వీ వనుచు ముదావహముగ | 19. |
తే.గీ. | అంతయుఁ దగ సిద్ధించు బ్రహ్మర్షి వీవు సంశయం బించుకయు లేదు సంయ మీంద్ర! నాఁ బలికి సుర వరులెల్ల నాకమునకుఁ జనిరి సంతస మలరంగ స్వాంతములను | 20. |
ఆ.వె. | పొంది కౌశికుండు మూరి బ్రాహ్మణ్య మా రీతి నంత బ్రహ్మఋషి వసిష్ఠుఁ బూజ సేసెను ముదమునను విశ్వామిత్రుఁ డు తగ బ్రహ్మఋషి వినుత యశస్వి | 21. |
కం. | కృత కామియై తపసునన్ స్థితుఁడై ధర సంచరించెఁ జిత్తం బలరన్ స్తుతమతి శ్రమించి యివ్విధి నితండు బ్రహ్మర్షి యయ్యె నినకుల రామా! | 22. |
తే.గీ. | ఇతఁడ మునివరుం డితఁ డగు సుతప మునకు మూర్తిమంతుఁ డితఁడె ధర్మ మూర్తి నిత్య మెంచఁ దాపసుల కితఁడ యెన్న లక్ష్య మగును రఘురామ! తామరసాక్ష! నిజము | 23. |
తే.గీ. | విప్రుఁ డా శతానందుఁడు విశ్రమించె నంత వచియించి యీ రీతి చెంత నుండి రామ లక్ష్మణులకు విని ప్రాంజలి యయి పలికె మిథిలాధిపతి గాధిపట్టి తోడ | 24. |
ఆ.వె. | ధన్యుఁడ నయితిఁ దమ దయ నందితి ముని వ రేణ్య! రాఁగ రఘు వరేణ్యుల సహి తమ్ము నా సవన వరమ్మును వీక్షింప మీరు ధార్మిక వర! గారవమున | 25. |
కం. | మీ దర్శనము పునీతుని గాఁ దనరిచె నను మునీంద్ర! యానందదమై మీ దర్శన మాత్రమ్మునఁ బాదుకొనెను గుణము లార్య! బహు పద్ధతులన్ | 26. |
ఆ.వె. | విస్తరముగఁ జెప్ప వింటిని మీ గొప్ప తపము కీర్తితం బనుపమ మెన్న రాముఁడును వినంగ నో మహాత్మా! దివ్య మైన నీదు గాథ వీను లలర | 27. |
తే.గీ. | మీ తపం బప్రమేయము మీ బలమ్ము నప్రమేయము గుణములు నప్రమేయ ములు సుమి కుశికాత్మజ! సతము సదసునకు వచ్చిన సదస్యులు వినిరి యచ్చెరువున | 28. |
ఆ.వె. | తనివి తీర దెంత తడవు వినిన నద్భు తంపుఁ గథలు మీవి తాపసేంద్ర! కర్మ కాల మయ్యె ఘర్మగభస్తియుఁ జాగెఁ బశ్చిమాద్రి సంయమీంద్ర! | 29. |
ఆ.వె. | ఎల్లి రేపకడ మునీంద్ర కాంచ నగును నన్ను స్వాగతమ్ము నా కనుజ్ఞ నిమ్మ కృప వహించి నెమ్మిఁ దేజోమయ! యంచు వేఁడ జనకుఁ డంచితముగ | 30. |
కం. | అన విని విశ్వామిత్రుఁడు జనకుఁ బ్రశంసించి పురుష సత్తమునిఁ దగన్ మన మలరఁగ సంప్రీతుని ముని వీడెను దత్క్షణంబ భూవరు నంతన్ | 31. |
కం. | పలికి జనకుఁ డట్టుల నొ జ్జలఁ గూడి ప్రదక్షిణమ్ము చక్కఁగ సంబం ధుల తోడను జేసెఁ దమి మి థి లాధి నాథుండు మునికి దేవ సమునికిన్ | 32. |
కం. | మునివరుల పూజలం గై కొని యా రాఘవులఁ గూడి కుశికాత్మజుఁ డం త ని జావాసమ్మున కేఁ గెను విశ్వామిత్రుఁ డెలమిఁ గీర్తింప జనుల్ | 33. |
ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నఱువది యేనవ సర్గము.
బాలకాండము
సర్గము 66.
విశ్వామిత్రుఁడు రామలక్ష్మణులు విల్లును వీక్షింప వచ్చిరని జనకునకుఁ జెప్పఁగ నా రాజు శివ ధనుస్సును దాను బొందిన విధము నెల్ల నుడివి రాముఁడు విల్లు నెక్కుపెట్టఁ గలిగిన నాతనికిఁ దన పుత్రిక సీత నిచ్చి వివాహము సేసెద నని వచించుట. | ||
కం. | తెలవాఱఁ బ్రభాతమున వి మలమునఁ గృత కర్మ భాసమానుం డంతం బిలిచెను విశ్వామిత్రుని నిలాపతి సరాఘవ యుగు నింపుగ భక్తిన్ | 1. |
కం. | జనక నృపతి ధర్మాత్ముఁడు ముని విశ్వామిత్రు రాజ పుత్రుల నామ్నా య నియతిఁ బూజించి మహా త్మునిఁ గౌశికుఁ గాంచి పలికె ముదమున నంతన్ | 2. |
కం. | స్వాగత మో దేవా! నీ వే గతి కార్యమ్ము గోరు దిమ్మానతినిన్ వేగం బాజ్ఞార్హుఁడ నే నో గురువర్యా! సభక్తి నొనరింప నిటన్ | 3. |
కం. | విని ధర్మాత్ముని నా జన కు నమ్మహాత్ముఁడు పలికెను గుశికాత్మజుఁ డం త నృవీరుం గని వాక్యము లను వాక్యజ్ఞుం డతి మధురమ్ముగ నిట్లున్ | 4. |
తే.గీ. | వీ రిరువురు దశరథ పృథ్వీశ పుత్రు లసదృశులు జగద్విశ్రుతు లవని నాథ! ఘనులు సుక్షత్రియులు నీదు కడ గలట్టి గొప్ప వింటిఁ గాంచఁగ వచ్చి రిప్పురుషులు | 5. |
తే.గీ. | భద్ర మగు నీకు రాజేంద్ర! పరమ ధనువు వీరి కింపుగఁ జూపింపఁ దీర వీరి కోరిక యెలమి మది నంది కోరి నట్టి చోటునకు నేఁగఁ గలవారు సుమ్మి వీరు | 6. |
ఆ.వె. | మునివరేణ్యు పల్కులను విని జనకుండు బదు లొసంగె నిట్లు మృదు ఫణితుల నుడివెద వినుఁ డా ధను విచట నున్న కా రణము నెల్లను వివరమ్ముగాను | 7. |
తే.గీ. | కలఁడు దేవరాతుఁ డనఁగ ఖ్యాతిఁ బడసి రాజు నిమికి నాఱవ వాఁడు తేజ మలర వాని హస్తము నందుంచెఁ దాను గుదువ నా మహాదేవుఁడు మహాత్ముఁ డార్య! విలును | 8. |
తే.గీ. | మున్ను దక్ష యజ్ఞక్షయము నొనరించి నప్పు డలుక రుద్రుఁడు గాంచి యమర గణముఁ బలికె భీషణ వాక్కులు వారి తోడ ధనువు నెత్తి హస్తమ్మున దారుణమును | 9. |
ఆ.వె. | స్వీయ భాగములను స్వీకరింపఁగ నుత్స హించి త్రిదశులార యుంచ రకట నాదు వంతు మీరు నఱకెద వింటి చే మీ వరాంగములను జేవ మీఱ | 10. |
కం. | విమనస్కులై యమరు లె ల్ల మునీంద్ర! శరణము వేఁడ రాజధరుఁడు ప్రీ త మనస్కుఁ డయ్యె భవుఁ డా యుమా ధవుండు కరుణా పయోనిధి యంతన్ | 11. |
చం. | ముదమున చంద్రశేఖరుఁడు ముచ్చట నిచ్చె ధనుస్సు నంత నా త్రిదశుల కుంచ భద్రముగ దిగ్వసనుండు త్రినేత్రుఁ డిచ్చినం బదపడి న్యాస భూతముగ వారలు దాని నొసంగి రింపుగా మ దుచిత వంశపూర్వునకు మౌనివరా! యిది గాంచ నయ్యదే | 12. |
తే.గీ. | దున్ను చుండ క్షేత్రము నేను దొరకె నాకు బాల యొకనాఁడు నాఁగటి చాలు నందు క్షేత్ర శోధన మడరంగ సీత యన్న నామ మందు విశ్రుత యయ్యె నామె ధరను | 13. |
ఆ.వె. | భూతలమ్ము నుండి పుట్టి వర్ధిల్లెను నా తనయగ మించి సీత తా న యోనిజ పెరుఁగంగ యోచించితిని వీర్య శుల్కము పడుచునకు సురుచిరముగ | 14. |
ఆ.వె. | పుడమిఁ బుట్టి మఱియు నడరి వర్ధిల్లు నా తనయఁ గాంచి వచ్చి తాపసేంద్ర! రా కుమారులు కడు వీఁక వరించిరి పరిణయమ్ము నెంచి తరుణి తోడ | 15. |
తే.గీ. | వీర్యమును శుల్కముగ నెన్నఁ గార్య మంచు వారికి వరించి వచ్చిన పార్థివులకుఁ బలికి కన్య నొసఁగ లేదు వారి కెవ్వ రికినిఁ దాపస పుంగవ ప్రకటిత మతి | 16. |
ఆ.వె. | స్వీయ శక్తి నిచట వీక్షింప శీఘ్ర మే తెంచ రాజ సుతులు మించి కలసి యెల్ల రుత్సహించి యుల్లమ్ము లలరంగ మిథిల కపుడు సంయమి వర గణ్య! | 17. |
ఆ.వె. | స్వీయ బాహు వీర్య జిజ్ఞాసుల కొఱకు ధనువును గొనితేరఁ దత్క్షణమ్ము వా రకట గ్రహింప నేరక యెత్తఁగ లేక నిలిచి రెడఁదఁ బ్రాఁక సిగ్గు | 18. |
కం. | తెలియఁగ వీర వరులలోఁ గల వీర్యం బల్ప మని ప్రకటముగ విను వా రల నేఁ దిరస్కరించితి లలితమ్ముగ మునివరేణ్య! రాజాత్మజులన్ | 19. |
ఆ.వె. | కోప మావహింప భూపతులకు నంత సందియమ్ము వారి శక్తిఁ గలిగి ముట్టడించిరి నిజ పురము మిథిల నెల్ల వారు మునివరేణ్య పగ వహించి | 20. |
కం. | అవమానింపఁ బడి రనుచు నవని పతులు దల్చి మనము లందుఁ గినుకతో నవియ హృదయమ్ములు మిథిల ను వెతల పాల్సేసి రత్యనుచిత విధములన్ | 21. |
చం. | కడవఁగ నొక్క యేఁ డటులఁ గాఱియ నిండు కొనంగ వస్తువుల్ వడసితి దుఃఖ మగ్గలము స్వాంతము నందు మునీంద్ర! యత్తఱిం గడఁగి తపమ్ము సేసి సురకాయము నెమ్మి నుతింపఁగా దయన్ వడి చతురంగ సైన్యమును బన్నుగఁ బంపిరి నాకుఁ దోడుగన్ | 22. |
తే.గీ. | వీర్య హీనులు మఱి నిజ వీర్య సంశ యులు నృపతు లెల్ల శీఘ్రమ యుద్ధ భగ్న హన్యమాను లయి సమంత్రు లాశలకుఁ బ రువులు వెట్టిరి పాపకర్ము లడలి కడు | 23. |
ఆ.వె. | అట్టి కాంతిమంత మైన యా ధనువును రామలక్ష్మణులకు నో మునీంద్ర! సువ్రతా! ముదముగఁ జూపింపఁ గలవాఁడ వారి కోర్కి దీర వలయు మఱియు | 24. |
ఆ.వె. | విల్లు నెక్కు పెట్ట విజయుండు రఘురాముఁ డైన మునివరేణ్య! నేను నా త నయ నవనిజ సీత నారీమణిని నిత్తు దాశరథికి మది ముదమ్ము మీఱ | 25. |
ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నఱువది యాఱవ సర్గము.
బాలకాండము
సర్గము 67.
రఘురాముఁడు శివధనుస్సును గరమున గ్రహించి నారి సంధింప నా విల్లు పెల్లున విఱిఁగిన జనకుఁడు సంతోషించి విశ్వామిత్రుని యనుజ్ఞతో మంత్రులను దశరథ చక్రవర్తి నాహ్వానించి తోడ్తేర నాదేశించుట. | ||
కం. | జనక విభు భాషణమ్ములు విని విశ్వామిత్రుఁ డవని విభువరుతోఁ బ ల్కెను మిథిలాధీశా! ధను వును జూపుమ రామున కని పుణ్యాస్త్రమ్మున్ | 1. |
తే.గీ. | అంత జనకుఁ డాదేశించె సంతసమున మంత్రులను దివ్యతమ ధనుర్మణిని గంధ మాల్య సువిభూషితమ్మును మానితమును దీసికొని రావలయు నంచు భాసితమును | 2. |
కం. | జన కాజ్ఞం జని సచివులు జనక పురికి నా పటు వగు చాపముఁ దమతోఁ గొని శీఘ్రమ్ముగ వారలు సనుదేరం జాగి రంత సముచిత రీతిన్ | 3. |
చం. | నరులు మహా బలాఢ్యులు సనాద సుదీర్ఘ శరీరు లింపుగా నరుగఁగ నైదు వేల భటు లాయత బాహులు లాగుచుండి భీ కరమును లోహపుం బదరికమ్మున నుంచిన చాప రాజమున్ గురుతర బాధ కోర్చి యటకుం దమిఁ జేరిరి యెట్టకేలకున్ | 4. |
తే.గీ. | ఇనుప పెట్టెలోఁ బెట్టిన ఘన ధనుస్సు ను గొనితెచ్చి యమాత్యులు తగఁ బలికిరి సుర సమాను మహాతేజు నరసి రాజ సత్తముని నతు లొనరించి సమ్మదముగ | 5. |
కం. | ఇది యా కార్ముక రత్న మ్ము దేనిఁ జూపింప నీవు పూనితి నృవరా! సదమల చిత్త! సకల రా ట్సదర్చితము సన్నుతమ్ము సద్గుణధామా! | 6. |
కం. | విని వారి భాషణములను ముని విశ్వామిత్రుని రఘుపుత్రద్వయముం గని కరముల నుంచి నుదుట జనకుఁడు రాజర్షి యనె వచనముల నిట్లున్ | 7. |
ఆ.వె. | ఈ ధనుర్వరమ్ము గాధేయ! జనకుల చేతఁ బూజితమ్ము శ్రేష్ఠ వీరు లు నృప పుంగవులును మును దగఁ బూరింప మూరి వా రశక్యు లైరి దేవ! | 8. |
చం. | సురలును రాక్ష సాసురులు శూర వరోరగ యక్ష వీర కి న్నర గణ దేవగాయనులు నైపుణ హీను లనంగ నెత్తఁగా నరిఁ దగఁ గూర్ప లాగఁగ మహాత్ములు మోయఁగ దాని నక్కటా నరులను వేఱ గాధి వరనందన! చెప్పఁగ నేల యిచ్చటన్ | 9. |
ఆ.వె. | అట్టి పెల్లు విల్లుఁ బెట్టితి మిచ్చటఁ గోరి నట్టి రీతి కుశికపుత్ర! రాజపుత్రలకుఁ గర మనురక్తిం జూపుఁ డింక దీని సన్మునీంద్ర! యిపుడు | 10. |
కం. | విని విశ్వామిత్రుఁడు జన కుని భాషితములను రామ! కోదండమ్ముం గనుమా వత్సా! యని ప ల్కెను గాకుత్స్థుం గని ముని కేలీ లీలన్ | 11. |
కం. | విని బ్రహ్మర్షి వచనములు ఘన పేటికఁ దెఱచి ఘనుఁడు కాకుత్శ్థుం డా ధనువు నటఁ గాంచి గురు వ ర్యునితోఁ బ్రీతిం బలికె సముచిత వచనముల్ | 12. |
తే.గీ. | విల్లు దొడ్డది యిది దేవ! యుల్ల మలరెఁ గాంచ దీని నబ్బురముగ మించి నేను ముట్టఁ గోరుదుఁ జేతిని నట్టె యెత్తి దీనిఁ బూరింప యత్నింతు మౌనివర్య! | 13. |
ఆ.వె. | మంచి దనిరి రాము మాటల నాలకిం చి పుడమి పతియు మునిశేఖరుండు ముని వచనములు విని మూరి పట్టె ధనువు నడుమ లీలఁగాను నరవృషభుఁడు | 14. |
తే.గీ. | నరులు వేవురు వీక్షింప నర వరుండు రఘుకుల తిలకుండు సలీల రాముఁ డంత నారి సంధించె ధను వెత్తి నలిన నేత్రుఁ డెలమి ధర్మాత్ముఁ డానంద మెడఁద నిండ | 15. |
మ. | అరి సంధించి నరోత్తముండు ఘన ధర్మాత్ముండు పూరింప నా వర కోదండము మధ్యలో విఱుగ శబ్దం బయ్యె నిర్ఘాత సు స్వర తుల్యంబుగఁ గంపనమ్ము లిలఁ గన్పట్టెన్ సు ఘోరమ్ముగా గిరి సంఘాతము ముక్కలయ్యెఁ గడు సంకీర్ణమ్ములై యెల్లెడన్ | 16. |
తే.గీ. | కూలిరి పుడమి మూర్ఛిల్లి ఘోర మైన శబ్దముల నాలకించి యశని నిభముల నెల్ల నరులు రాఘవులు మునీంద్రుఁ డింక రాజు దక్కంగ నచ్చట రాళ్ల పగిది | 17. |
ఆ.వె. | తేఱుకొనఁగ జనులు ధీనిధి పతి భీతి దొలఁగ వాక్యవిదుఁడు దోయిలి ఘటి యించి వాక్యములు మునీంద్రుని వీక్షించి పలికె నింపు కొలుప నలరి యంత | 18. |
తే.గీ. | దేవ! కంటి రాముని వీర్య మీ విధముగ దశరథాత్మజుని బల మత్యద్భుతం బ చింత్య మింక ననూహ్యము చేవఁ గాంచ సంతసం బయ్యె మిక్కిలి సంయమీంద్ర! | 19. |
కం. | జనక కులకీర్తిఁ బెంచును ఘనముగ నాదు సుత సీత కర మంది మహా త్ముని రాముని దశరథ నం దనుని యెలమి సంయమీంద్ర! తత్పరత వెసన్ | 20. |
తే.గీ. | నా ప్రతిన వీర్యశుల్క మనంగ నయ్య ది నిజ మయ్యెఁ గౌశిక! ఘన మునివరేణ్య! ప్రాణ సమను సీతను సుత రామునకు నొ సంగ వలయు నిశ్చింతగ సంతసమున | 21. |
కం. | మీ యనుమతి నా మంత్రులు వే యరుగ నయోధ్య కిండు ప్రీతిని మీ ర ట్లీయఁగఁ బంపుదు రథముల నాయతముగ భద్ర మగు మహాత్మా! మీకున్ | 22. |
తే.గీ. | వీర్యమునకుఁ గానుక సీత వీరవరుఁడు రామున కొసంగుట పలికి రమ్య రీతి నెల్ల నిఁకఁ బ్రీతి భాషల నెలమి రాజుఁ దోడితెత్తురు మిథిలకుఁ దూర్ణ మార్య! | 23. |
ఆ.వె. | రామలక్ష్మణులు వరముని గుప్తు లనియు దశరథునకుఁ దెలిపి ధరణి పతికిఁ బ్రీతి నొంది నట్టి పృథివీపతినిఁ గొని తెత్తు రిటకు వేగ దేవ! మీఱి | 24. |
కం. | ముని యట్లె యనఁగ నరపతి తన మంత్రుల సంప్రదించి ధర్మాత్ముఁడు వే పనిపె నయోధ్యకు సచివుల ను నుడివి కథ నెల్ల రాజును గొని మరలఁగన్ | 25. |
ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నఱువది యేడవ సర్గము.
బాలకాండము
సర్గము 68.
జనకుని యాజ్ఞతో దూత లయోధ్యకుఁ జేరి దశరథునితో రామలక్ష్మణులు విశ్వామిత్రు రక్షణములో నున్న వారని, శివ ధనుర్భంగ వృత్తాంతము, జనకుని వీర్యశుల్క విషయ ప్రతినను దెలిపి జనకాత్మజ సీతను రాముని కీయ దశరథుని యనుమతి జనకుఁడు కోరి మిథిలకు నాహ్వానించుటను దెలిపిన దశరథుఁడు మంత్రులను సంప్రదించి యంగీకరించి మిథిలకు మరునాఁడు ప్రయాణమును దలపెట్టుట. | ||
కం. | జనకుని యాదేశమ్మునఁ జని దూతలు గడపి మున్నిశలు మార్గం బం దు నలసిన గుఱ్ఱములతో ఘనపుర రాజం బయోధ్యఁ గదిసిరి ప్రీతిన్ | 1. |
ఆ.వె. | రాజ భవనమునకు నోజ దూతలు సేరి ద్వారపాలకులను గోరి రిట్లు జనక రాజదూత లని మమ్ముఁ దెల్పుఁడు రాజనకు త్వరితము రాజ భటులు! | 2. |
తే.గీ. | రాఘవునకు నివేదింప రాజ భటులు రాజు ననుమతిఁ జేరిరి రాజగృహము దూత లంతఁ గాంచిరి దేవ తుల్యు నా ద శరథుని నృపతి వృద్ధుని సంతసమున | 3. |
తే.గీ. | కేలు ముకుళించి దూతలు మేలి మాట లిట్లు రాజు తోడఁ బలికి రింపు కొలుప గౌరవముగ విగతభీతి వార లెల్ల మధురమైన భాషణములు మంత్రు లరయ | 4. |
మ. | మిథి లాధీశుఁడు ధీవరా! జనకుఁ డమ్మేధావి మిమ్మున్ మహా రథ! క్షేమంబును వృద్ధినిం దమిని సంప్రశ్నంబు సుస్నేహపుం బథ మూహించి పురోహితవ్రజ మహోపాధ్యాయులం గూడి యో పృథివీశా! నిరతాగ్నిహోత్ర యుత! సంప్రీతమ్ము సేసెం దగన్ | 5. |
తే.గీ. | అడిగి నిఃక్షోభము కుశల మవనినాథ మునివరేణ్యుఁడు కౌశికు ననుమతిఁ గొని జనకుఁడు మిథిలాధీశుఁడు చక్కఁగ వచ నములు వైదేహుఁడు పలికె నయము లిట్లు | 6. |
తే.గీ. | మున్ను నా చేసిన ప్రతిన కన్నియ కగు శుల్క మది వీర్యమే యని సువిదతమ్ము వీర్య హీనుల విడిచితిఁ బెల్లు కోప మూని రెల్లరు రాజులు దాన రాజ! | 7. |
ఆ.వె. | అట్టి నాదు తనయ నంత విశ్వామిత్రు తో నరుగుచు నిచ్చ తోడ వచ్చి రిటకు నీ తనయులు పటువీర వరు లందు నగ్రజుఁడు జయించె నవని నాథ! | 8. |
కం. | పెనువిల్లు దివ్య మయ్యెను ధ్వనితో భగ్నము మహాత్ము బాహువు లందున్ జను లెల్లరు చూడఁగ రా మునిచే రాజేంద్ర! నడుమ ముచ్చట గొలుపన్ | 9. |
తే.గీ. | సుతను సీతను వర వీర్యశుల్క నీయఁ దగు మహాత్మునకు నరేంద్ర! దాశరథికిఁ బ్రతినఁ బూరింప నెంతును బన్నుగా న నుజ్ఞ నీయ నర్హులరు ధర్మజ్ఞ! మీరు | 10. |
కం. | ఒజ్జలు పురోహి తాదిగ సజ్జనులం గూడి రండు సముచితముగ వే యిజ్జగతి భద్ర మగు మీ కిజ్జనవర రాఘవులను నీక్షింపఁ దగున్ | 11. |
ఆ.వె. | ప్రీతిఁ గూర్పఁ దగుదు పృథివీశ! తగ నాకుఁ బ్రతిన నిజము కాగ రహి చెలంగు పుత్ర యుగ్మముఁ గని ముదము నొందఁ గలవు చిత్త మందు రాజ సత్తమ! కడు | 12. |
తే.గీ. | అనుమతింప విశ్వామిత్ర ముని వరుండు గొని శతానందు నభిమతమును విదేహ రాజు పలికె నిట్టులు మధురపు గిర లని ప్రీతి నాగిరి శంకతో దూత లంత | 13. |
కం. | విని దూతల పల్కులు వొం దెను బరమానందము నృపతి దశరథుం డి ట్లనె వామదేవుని వసి ష్ఠుని మంత్రుల నన్య జనులఁ జూచి వచనముల్ | 14. |
కం. | ఘన కౌసల్యానందద తనుండు కౌశికుని యండఁ దమ్ముఁడు సౌమి త్రునితో విదేహ దేశ మ్ము నందుఁ దమి నున్నవాఁడు పుత్రుం డెలమిన్ | 15. |
తే.గీ. | వీర్య సుపరీక్షితుఁడు నరవర్య జనకు చేతఁ గాకుత్స్థుఁడు సుతను సీత నీయ రామునకు నిష్ట పడుచుండె రాజవరుఁడు సంతసమున మహాత్ముఁడు క్షత్రియ ఋషి | 16. |
కం. | జనకుని వృత్తము నచ్చిన జననాథు మహాత్ముని దెదఁ జనెదము నగర మ్మునకు వెస నేల కాల మ్మును వ్యర్థము సేయ మనకుఁ బురమున కేఁగన్ | 17. |
తే.గీ. | మంత్రులు మహర్షు లెల్లరు మంచి దనిరి విని నృపతి పలుకులు ప్రీతి దనర మదుల నంత మంత్రులతో ననె సంతసమున నెల్లి పయన మంచు నరేంద్రుఁ డుల్ల మలర | 18. |
కం. | సర్వ గుణముల విరాజిలు నుర్వీశుఁడు సత్కరింప నుప్పొంగి మ హా ఖర్వ మమాత్యులు రాతిరి సర్వమ్మును గడపి రంత సంతోషముగా | 19. |
ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నఱువది యెనిమిదవ సర్గము.
బాలకాండము
సర్గము 69.
తెల్లవాఱఁగ దశరథుఁడు సుమంత్రునితోఁ బ్రయాణ సన్నాహములను జేయ మని కోశాధికారి పుష్కలముగ ధన రత్నాదులతో ముందు చనవలె నని రాజాజ్ఞ నొసఁగి యమాత్య వసిష్ఠాది పురోహితులతో మిథిలకుఁ జేరుకొనుట, జనకుని సత్కారము లందుకొని యా రాత్రి గడపుట . | ||
కం. | చన రాత్రి యుపాధ్యాయులఁ దన చుట్టమ్ములను గలసి ధరణిపతి సుమం త్రునితో దశరథుఁడు ముద మ్మునఁ బల్కెను మధుర వచనముల నిబ్భంగిన్ | 1. |
కం. | ధనముం గొని పుష్కలముగఁ జనఁగ ధనాధ్యక్షులు మును సర్వులు వేగ మ్మున నానా రత్నములను గొని రాజాజ్ఞ యని పల్కి కూర్పుము వారిన్ | 2. |
కం. | చతురంగ బలమ్ములు చన నతి శీఘ్రమ్ముగ మదాజ్ఞ నఖిలమ్ములు నా తత యానమ్ములును సుమం త్ర! తరల వలయుం జుమి యుచిత గతిని వినుమా | 3. |
తే.గీ. | వెస వసిష్ఠఁడు వామదేవ సహితము చి రాయువుండు మార్కండేయుఁ డతుల తాప సుండు జాబాలి కాత్యాయనుండు నింక కాశ్యపుఁడు మున్ను విప్రు లేఁగంగ వలయు | 4. |
కం. | సమకూర్పుము నా రథమును సుమంత్ర! యాలస్య మేల సుమతీ! యింకన్ సమదం బేఁగ వలయు ద్వరి తమ చనఁ దగు నంచు దూత తతి వచియించెన్ | 5. |
తే.గీ. | ఱేని యానతి వేగ మఱి చతురంగ బలము ఋషులఁ గూడి చనఁగ నలరి ముందు వెనుకఁ దాఁ గదలెం బృథివీ ధవుండు సంభ్రమముగ దశరథుండు సద్గుణుండు | 6. |
కం. | చని నాల్గహముల మార్గ మ్ము నవ్విదేహ విషయమ్ము మూరి కదియఁగన్ జనకుం డెఱింగి యద్దా నిని సత్కార మొనరించె నెయ్యము మీఱన్ | 7. |
ఆ.వె. | అంత రాజు వృద్ధు నా దశరథు సమీ పించి సంతసమ్ము మించి పడసె నెడఁద జనకుఁడు మిథిలేశుండు వాక్య వి శారదుండు వినుత చక్రవర్తి | 8. |
తే.గీ. | పలికె నా నరశ్రేష్ఠుఁడు పన్నుగ నర పుంగవుని తోడ స్వాగతమ్ము నృపవర్య కంటి భాగ్యవశమున రాఘవ! పడయుదు ప్రీతిఁ గాంచి వీర సుతుల విరివి నిచట | 9. |
తే.గీ. | కంటిని వసిష్ఠు నిచ్చటఁ గర మదృష్ట మనఁగ సకల ద్విజుల మధ్య నలరి మిగుల దేవతలఁగూడి నలరెడి దేవపతి శ తక్రతు నిభమై యింపుగఁ దనరు వాని | 10. |
తే.గీ. | కృప దొలంగె విఘ్నము లెల్లఁ గృప చెలంగఁ బావనం బయ్యెఁ గులము సంబంధ మమర రాఘవుల తోడ వరవీర రాజ వరుల తో మహాత్ముల తోడ సంతోషముగను | 11. |
తే.గీ. | ఎల్లి యుదయమ్ము భూవరేం ద్రేంద్ర నెమ్మి పరిణయమ్మును జరిపింప నరవరేణ్య! యర్హుఁడవు నీవు జన్నంపు టంత మందు సంయమీంద్రుల కెల్లను సమ్మతమ్ము | 12. |
కం. | అన విని ముని వర్యుల మ ధ్యను వాక్య విశారదుండు ధరణీపతి య జ్జనకుం గాంచి నృప వరేం ద్రునిఁ బ్రత్యుత్తరము నిచ్చెఁ దుష్టాత్ముండై | 13. |
తే.గీ. | పుచ్చుకొనుట యిచ్చెడు వాని యిచ్చ నుండు నంచు వింటిమి మున్ను మే మంచితముగఁ బరమ ధర్మజ్ఞ మీరెట్లు పల్క నట్లు చేయఁ గల వారలము మేము వేయు నేల | 14. |
తే.గీ. | అచ్చెరువు నందు మునిఁగెఁ దా నప్పలుకుల నాలకింపంగ నత్తఱి నా యశస్వి ధర్మతత్పరుండు నుత సత్యవచనుండు దశరథుం డన జనకుండు ధరణి ధవుఁడు | 15. |
కం. | మును లెల్లరును గలసి యొక రి నొకరు హర్షమ్ము నందిరి మదుల మిగులం దనరుచు నిష్టాగోష్టిన్ ఘనులా ద్విజులు గడపిరి సుఖమ్ముగ రాత్రిన్ | 16. |
కం. | కని రామలక్ష్మణుల సుతు లను బరమానందము దశరథ నృపుఁ డందెన్ జనకుని సత్కారమ్మును ఘనముగ నంది గడపెను సుఖమ్ముగ రాత్రిన్ | 17. |
తే.గీ. | జనకుఁ డా మహా తేజుఁడు ఘనుఁడు తత్త్వ వేత్త క్రతు ధర్మ సత్కార్య వితతి పుత్రి కా ద్వయ విహిత కార్య నికాయము లొన రించి రాత్రి గడపెఁ బ్రీతి నంచితముగ | 18. |
ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు నఱువది తొమ్మిదవ సర్గము.
బాలకాండము
సర్గము 70.
జనకుఁడు పిలువఁ దమ్ముఁడు కుశధ్వజుఁడు మిథిలకు వచ్చుట, దశరథుని కోరిక మేర వసిష్ఠుఁడు దశరథుని వంశ క్రమమును వర్ణించుట. | ||
కం. | అంత నుదయంపుఁ బను లవి యంతము కా మునుల కెల్ల నవని పతి మనః శాంతమున శతానందుని యంతికమున కేఁగి పల్కె నలరుచు నిట్లున్ | 1. |
మ. | నిజ సద్భ్రాత మహా ప్రభా తనుఁడు సన్నిష్ఠాత్ముఁడుం దాఁ గుశ ధ్వజ నాముం డనుజోత్తముండు జన సంభావ్యుండు సాంకాశ్య నా నిజ దివ్యేక్షుమతీ నదీ తట పురిన్ నిత్యమ్ము పాలించు నో జ జలంబే తగ మేర కా నిలువ ద్రాక్షావ్రాతమే యాతనిన్ | 2. |
ఆ.వె. | చూడ నిచ్చగింతు సుచరిత్రు యజ్ఞ ర క్షకు నిట మునివర్య! సంతసమ్ము నతఁడు నన్ను గూడి యనుభవింపఁ దగును డెంద మందుఁ దేజ మందు ఘనుఁడు | 3. |
కం. | అనుచుండ నా శతానం దు నెదుట నట్లు జనకుండు తూర్ణం బేతెం చ నచలితులు కొంద ఱటకు జను లాదేశించె వారి జనకుం డెలమిన్ | 4. |
కం. | వడి నేఁగు గుఱ్ఱములపై నొడయుని యాజ్ఞఁ దలఁ దాల్చి యుర్వీశునిఁ దే నడరుచు వా రేఁగిరి వడి బిడౌజు పంపునను విష్ణుఁ బిల్చిన భంగిన్ | 5. |
కం. | చని సాంకాశ్యాఖ్య పురము కని రాజు కుశధ్వజు జనక సహోదరు నం త నివేదించి జరిగినది జనకుని చింతనముఁ దెల్పఁ జక్కఁగ నంతన్ | 6. |
ఆ.వె. | వీర దూత వరులు వినిపించినది యెల్ల విని కుశధ్వజుండు విభుని యాజ్ఞ జనక భూరమణునిఁ గను కుతూహలమున నేఁగుదెంచె మిథిల కెలమి వేగ | 7. |
తే.గీ. | వచ్చి గాంచి మహాత్మునిఁ బరమ ధర్మ పరుని యన్న శతానందు వందనము లి డి యుభయులకు నమ్రుఁ డయి భక్తి యుతముగ వ రాసనమ్మున నాసీనుఁ డయ్యె నంత | 8. |
తే.గీ. | అమిత తేజులు నతి వీరు లన్నదమ్ము లట్లు కూర్చుండి యుచితంపు టాసనముల మంత్రి వర్యు సుదామను మనుజ వర్యు నాదరమునఁ బంపి రని వాక్యముల నిట్లు | 9. |
తే.గీ. | వెడలి మంత్రివరేణ్య దుర్భేదు నిన కు లేశు నిక్ష్వాకు దశరథు నెలమి పుత్ర సహిత మింక విప్రామాత్య సహిత మిటకు గౌరవమ్ముగఁ గొనితెమ్ము కాంతిమంతు | 10. |
ఆ.వె. | చని గుడారములకు సాకేతపుర నాథ వరుని రఘు కుల ఘన వర్ధను గని వందనము లొసంగి వంచి శిరస్సును బన్నుగ వచనములు పలికె నిట్లు | 11. |
తే.గీ. | పరమ వీర! యయోధ్యాధిప! మిథిలాధి పుండు వైదేహుఁడు పురోధ పుంగవ సహి తమ్ము మఱి యుపాధ్యాయ యుతమ్ము మిమ్ముఁ గాంచ నుపవిష్టుఁ డై యుండె నంచితముగ | 12. |
ఆ.వె. | విని యమాత్య వరు వచనములు ముద మంది బంధు సర్షి మంత్రి పటల యుతము జనకుఁ డున్న దేశమున కేఁగుదెంచెను రాఘవుఁడు దశరథ రాణ్మణి వడి | 13. |
కం. | నరపతి సబంధు మంత్రి స గురు గణము విదేహపతినిఁ గూర్మి నరసి స ద్గిర లెఱిఁగిన శ్రేష్ఠుండు మ ధురమగు వాక్యమ్ముల ననెఁ దూర్ణం బిట్లున్ | 14. |
కం. | రాజేంద్ర! నీ వెఱుంగుదు రాజుల కిక్ష్వాకులకుఁ బరమ దైవత మీ తేజస్వి వసిష్ఠుఁడు తా భాజనుఁ డగు మాకు మాఱు పల్కఁగఁ బనులన్ | 15. |
తే.గీ. | అనుమతింప విశ్వామిత్రుఁ డఖిల ముని ని చయము ధర్మాత్ముఁడు వసిష్ఠ సంయమీంద్రుఁ డు వచియించును దగ మా పటుతర వంశ వృక్షమును యథాక్రమమున సుక్షితీశ! | 16. |
తే.గీ. | పలికి దశరథుం డిట్టులు సలలితమ్ము మౌన మూనె నరేంద్రుఁడు ఱేని గమికి నడుమ నంత వసిష్ఠుఁడు దొడఁగె వాక్య విదుఁడు స పురోహిత నృపతి కెదుటఁ జెప్ప | 17. |
తే.గీ. | నలువ యవ్యక్త తేజుఁడు నలినజుండు శాశ్వతుండు నిత్యావ్యయ విశ్వసృజుఁడు వాని కుద్భవించె మరీచి వాని సుతుఁడు కశ్యపుఁడు వివస్వంతుఁ డంగజుఁ డతనికి | 18. |
తే.గీ. | మనువు వైవస్వతుండు దాఁ దనరి మును ప్ర జా పతిగఁ బ్రసిద్ధుండు ప్రజా పతికిఁ గు మారుఁ డిక్ష్వాకుఁడు మొదటి మగఁడు పుర మ యోధ్య కతని కింపుగఁ గుక్షి యుద్భవించె | 19. |
సీ. | కుక్షికిఁ బుట్టె వికుక్షి శ్రీమంతుఁడు నతనికి బాణుం డమిత బలుండు బాణునకుఁ బ్రతాపవంతుఁ డగు ననరణ్యుండు తేజస్వికి నుద్భవించెఁ బృథు వాతని సుతుండు వీర త్రిశంకువు దుందుమారుండు సుతుం డతనికి యువనాశ్వుఁ డాతఁడె యుర్వీధవుండు మాంధాత యతని కయ్యెఁ దనయుఁ డెలమి | |
తే.గీ. | ఘనుఁడు మాంధాతకు సుసంధి తనయుఁ డాయె నతనికి ధ్రువసంధి ప్రసేనజితుఁ డనంగ నిద్దఱు సుతులు ధ్రువసంధి కెలమిఁ బుట్టె భరతుఁ డసితుఁడు నందన వరుఁ డతనికి | 20. |
చం. | అసితున కైరి శత్రువులు హైహయు లా శశిబిందు తాళ జం ఘ సహిత శూర పుంగవులు కానలు సేరి పరాజితుండు నా యసితుఁడు మంచుకొండ దరి కల్పబలుండు సభార్య మంత్రి వ ర్గ సహిత ముండె నా పుడమి కాంతుఁడు భీతి భృగూత్స వాటినిన్ | 21. |
తే.గీ. | దార లిద్ద ఱపుడు గర్భ ధారిణు లని విదిత మొక సతి సవతికి విష మొసంగెఁ జ్యవన నాముఁడు భార్గవుఁ డవని సురుఁడు హిమనగం బాశ్రయించి యుండె ముని వరుఁడు | 22. |
కం. | ఒక సతి దారల లోన సు త కాంక్ష భార్గవు సురనిభుఁ దపసి మహా భా గ కొలువ మృగలోచన య న్య కాంత కాళిందియు సుతు నందఁగఁ గొలిచెన్ | 23. |
చం. | ముని యనె దేవి తోడ వగపుం గొన కమ్మ మహా బలుండు దా జననము నొందు శీఘ్రమున సన్నుత శూరుఁడు నీకు నా వ రా నన పతి శోక తప్త ఘన నందను బట్టపు రాణి దాఁ గనెన్ ఘన విష సంయుతమ్ముగ సుఖమ్ముగఁ దాపసి పల్కి నట్టులన్ | 24. |
ఆ.వె. | సవతి యీయ విషము చంపఁ బిండమ్మును గరము తోడఁ బుట్ట వరసుతుండు సగరుఁ డంచు నామ సార్థకంబును గాంచె రాజ సుతుఁడు ఘన పరాక్రముండు | 25. |
సీ. | అసమంజసుఁడు సగ రాత్మజుం డంశుమంతుఁ డతని సుతుఁడు పుత్రుం డతనికి నా దిలీపుఁడు దిలీ పాత్మజుఁడు భగీరథుండు కాకుత్స్థుఁ డుద్దండ సుతుఁ డ తనికిఁ గాకుత్స్థుని తనయుఁడు రఘువు నరాదక కల్మాషపాదుఁడు రఘు నందనుం డతని తనయుఁడు శంఖణుఁ డితనికి సుదర్శనుఁ డితనికిఁ గుమారుఁ | |
తే.గీ. | డగ్నివర్ణుఁడు శీఘ్రగుఁ డతని సుతుఁడు శీఘ్రగు సుతుఁడు మరువు ప్రసిద్ధుఁ డితని పుత్రుఁడు ప్రశుశ్రుకుఁ డితని పుత్రుఁ డంబ రీషుఁ డితనికి నహుషుఁడు రిపు దమనుఁడు | 26. |
తే.గీ. | నహుషునకు యయాతి జనించె నందనుఁడు య యాతి పతికి నాభాగుఁడె యాతని తన యుం డజుఁ డజునకు దశరథుండు రామ లక్ష్మణు లితని తనయులె రాజముఖ్య! | 27. |
తే.గీ. | కులమున మొదలు నుండియు గొప్ప ధర్మ రతులు రాజు లిక్ష్వాకులు సతత సత్య వాదు లెల్ల వీర వరులు భాస్క రాన్వ యులు విమల చరితులు నృవ రోత్తములును | 28. |
కం. | నృవరా నీ తనయ లుభయు ల వరులుగ వరించు రామలక్ష్మణుల నిఁకం బ్రవరులకు నీయ నుచితము ప్రవరలను నరేంద్ర యెంచ వైదేహ నృపా! | 29. |
ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు డెబ్బదవ సర్గము.
బాలకాండము
సర్గము 71.
జనకుఁడు తన వంశ వృక్షమును వినిపించుట. రామలక్ష్మణులకు సీత నూర్మిళల నిత్తు నని మూడవ దినమున నుత్తరఫల్గునీ నక్షత్రమున వివాహము జరిపింపు మని దశరథుని వేఁడుట. | ||
కం. | విని యా వసిష్ఠు పలుకులు జనకుఁడు వినయమ్ముతో వచనములు దగ ని ట్లనియెన్ నిజ వంశక్రమ ము నుడివెద వినుండు భద్రము దనరు మీకున్ | 1. |
కం. | కన్యా దానంపుఁ దఱి వ దాన్యునకు మునీంద్ర! ప్రీతిఁ దన వంశ గతిన్ ధన్యత నుడువంగ వలయు మాన్యచరిత్ర! యన నాదు మాటలు వినుఁడీ | 2. |
తే.గీ. | స్వీయ కర్మగణమ్ముల విశ్రుతుండు ముజ్జగమ్ముల నిమి విభుఁ డజ్జన పతి యగ్రగణ్యుఁడు సత్త్వ జనాళి యందుఁ బరమ ధర్మాత్ముఁ డుత్తమ పార్థివుండు | 3. |
తే.గీ. | వాని కంతఁ బుట్టెను మిథి వాని చేత నిర్మితమ్ము మిథిల యని నెగడు పురము జనకు లందు మొదటి వాఁడు జనకుని తన యుం డుదావసుఁ డన సద్గుణుండు ఘనుఁడు | 4. |
ఆ.వె. | నందివర్ధనుండు నందనుఁ డగు నుదా వసువునకు సుకేతు వసుమతేశుఁ డతని సుతుఁడు తనయుఁ డగు దేవరాతుఁడు పతి సుకేతువునకు బల్లిదుండు | 5. |
తే.గీ. | దేవరాతుని సుతుఁడు క్షితి వినుతుండు రాజఋషి నాఁ బరగి బృహద్రథుఁ డతనికి వీరుఁడుఁ బ్రతాపుఁ డగు మహావీరుఁ డనెడు వాఁడు సంభవించెను దగ వేడుకగను | 6. |
తే.గీ. | సత్యవిక్రముఁడు సుధృతి జనన మందె నంత నా మహావీరున కతఁ డతి ధృతి మంతుఁడు సుధృతికిఁ దనయుఁ డంతఁ బుట్టె దృష్టకేతువు ధార్మికుఁ డిష్ట మడర | 7. |
ఆ.వె. | దృష్టకేతువునకుఁ గృతమతి హర్యశ్వుఁ డుదితుఁ డయ్యె నాతఁ డుత్తమముగ రాజఋషి యనంగ రాజిల్లె నతనికిఁ బుట్టె మరు వనంగఁ బట్టి యంత | 8. |
ఆ.వె. | స్థిరుఁడు మరువునకుఁ బ్రతింధకుఁడు జనించెఁ గీర్తిరథుఁడు వానికి జనియించె ధర్మచిత్తుఁ డతఁడు ధరణి విభుఁడు దేవ మీఢుఁ డతని సుతుఁడు గాఢ బుద్ధి | 9. |
ఆ.వె. | దేవమీఢ తనయుఁ డా విబుధుఁడు మహీ ధ్రకుఁడు విబుధు సుతుఁ డితనికిఁ గీర్తి రాతుఁడు తనయుఁడు బలము మిక్కుటము మహా రోముఁ డతని సుతవరుండు ఋషియు | 10. |
తే.గీ. | ఆ మహారోమున కతి ధర్మాత్ముఁ డైన స్వర్ణరోముఁడు రాజర్షి జనన మందె నతని కుదయించెఁ బన్నుగ హ్రస్వరోముఁ డితనికి సుతద్వయము పుట్టె నెలమి మీఱ | 11. |
తే.గీ. | రాజు హ్రస్వరోమునకు ధర్మజ్ఞునకు జ నించితిమి జ్యేష్ఠుఁడను నేను మించి తమ్ముఁ డైన యీ కుశధ్వజుఁడు మహాపరాక్ర ముండు వీరుండు సద్గుణ మండితుండు | 12. |
కం. | నను రాజ్యమున నిలిపి మా జనకుండు కుశధ్వజు ననుజవరుని భార మ్మును నా పై మోపి వన మ్మున కేఁగెను భూవరుండు మునిగణ ముఖ్యా! | 13. |
కం. | దివ మేఁగ జరా భార మ్ము వహించి జనకుఁడు స్నేహము దనరఁ గడు నా యవరజుఁ గుశధ్వజుని దే వ వరాభుని ధర నరయుచు వచ్చితి దేవా! | 14. |
తే.గీ. | అంతఁ గొంత కాలమునకు నరుగుదెంచి పురము ముట్టడించె సుధన్వ నరవిభుండు వీర్యవంతుఁడు సాంకాశ్య విశ్రుత పుర వరము నుండి మిథిలను సబలము మీఱి | 15. |
కం. | పరమ శివ ధనుస్సు మఱియు వర కన్యామణిని సీతఁ బద్మదళాక్షిన్ సురుచిరముగఁ దన కిమ్మని నరనాథుండు గిర లంపె నా కుద్వృత్తిన్ | 16. |
కం. | ఈ కున్నను బ్రహ్మర్షి! మ హా కలహం బయ్యె నంత నాతని తోడన్ భూకాంతుఁడు నా చేతను భీకరముగఁ జచ్చె నాజి విప్రవరేణ్యా! | 17. |
కం. | నరనాథు నిహతుఁ జేసి స మరమ్మునఁ గుశధ్వజుని సమంచిత రీతిం బుర మా సాంకాశ్య కనువు గ రాజుఁ జేసితి మునీంద్ర గారవ మొప్పన్ | 18. |
తే.గీ. | ఆతఁడు కనిష్ఠ సోదరుఁ డన్న నేను ముదము చెలఁగ నెడఁద నిత్తు మూరి సీత ను దగ రామున కూర్మిళను మఱి లక్ష్మ ణునకు భద్ర మగును మీకు మునివరేణ్య! | 19. |
ఆ.వె. | వీర్యశుల్క సీత వీరుండు రామున కిత్తు నూర్మిళ నిఁక నిత్తు లక్ష్మ ణునకు శంక యేల నుడివెద ముమ్మారు సంతసమ్ము దనర సంయమీంద్ర! | 20. |
తే.గీ. | ఇత్తు వధువుల రఘువీర! యెలమి రామ లక్ష్మ ణార్థమ్ము నిండు నాల నధికమ్ము గాను బితృ కార్యము లొనర్పుఁడీ నయముగ భద్ర మగుఁ జల్పుఁ డంత వివాహ మడరి | 21. |
తే.గీ. | నేఁడు మఖ మహాభాహు వీ మూడవ దిన మందు నుత్తర ఫల్గుని యందు రాజ! తగ వివాహము జరిపింపఁ దగును మీకుఁ దనయుల కయి దానములు కర్తవ్యము లగు | 22. |
ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు డెబ్బది యొకటవ సర్గము.
బాలకాండము
సర్గము 72.
విశ్వామిత్రుఁడు జనకునితో భరత శత్రుఘ్నులకుఁ గుశధ్వజుని కుమార్తెల నిచ్చి వివాహము సేయ నుత్తమ మని సూచింప సంతోషముగ జనకుఁ డంగీకరించుట, పిదప దశరథుఁడు నిలయమునకుఁ బితృ కార్యములకుఁ బుత్రార్థము దాన కార్యాదులకై వెడలుట. | ||
కం. | అన నట్లు జనకుఁడు నృపతి ముని విశ్వామిత్రుఁ డంత మూరి వసిష్ఠుం డును దోడుండఁగ నవ్వీ రుని వీక్షించి పలికెను గురుతర వచనముల్ | 1. |
తే.గీ. | అప్రమేయములును ననూహ్యమ్ము లీ కు లములు పుడమి నిక్ష్వాకుల లలితతర వి దేహుల కులమ్ము లెంచ విదేహ రాజ! వీనికి సమము లరయము విశ్వ మందు | 2. |
చం. | తగుదురు రామలక్ష్మణులు ధారుణి సీతకు నూర్మిళా సతీ మృగ సదృశాక్షికిం గరము మేటి కులమ్మున రూప సంపదం దగుదురు వీరు వారికినిఁ దథ్యముగాఁ బరికించి చూచినన్ జగములఁ గాంచ మిట్టి వర సంగమ మెందును రాజపుంగవా! | 3. |
ఉ. | చెప్పఁ దగుం దిరమ్ముగ విశేషము నొక్కటిఁ దప్పకుండఁగా నొప్పుగ నీ కుశధ్వజుని యుత్తమ కన్యక లిద్దఱిం దగం జొప్పడు గోర నింపుగను సువ్రత! దారలు గాఁగ రూప మం దిప్పుడమిం గనంగ సరి యిద్ధరణీపతి పట్టి జంటకున్ | 4. |
తే.గీ. | భరత శత్రుఘ్నుల కొఱకుఁ బద్మ నయన లిద్దఱిని నరేంద్ర! మహాత్ములిరువురకును దశరథాత్మజులు సుర సదృశ మహా ప రాక్రములకు విశ్వప సముల కడిగెదము | 5. |
తే.గీ. | పుణ్య కర్ము లిక్ష్వాకులు పుడమి నాథ! మీ కులమ్ము నట్టులఁ జుమ్ము మీ రుభయులు వియ్య మందుఁడు చక్కఁగ విగత చింత రెండు కులములు వర్ధిల్ల మెండుగాను | 6. |
కం. | అన విని విశ్వామిత్రు వ చనమ్ములు వసిష్ఠు మతియు జనకుఁడు వినయ మ్మునఁ బ్రాంజలి వాక్యమ్ములు మునిద్వయము గాంచి పల్కె మోదం బలరన్ | 7. |
కం. | మీ రిట్లానతి నీయఁగ గారవమున సదృశ వంశ ఘన సంగమ మే పారఁగఁ దలంతు నా కుల మీ రీతిగ ధన్య మయ్యె నిద్ధర నంచున్ | 8. |
ఆ.వె. | అట్ల యగును భద్ర మగును మీకుఁ గుశధ్వ జుని తనయలు వీరు తనరి నలిన నేత్ర లింక భరత శత్రుఘ్నులను భజిం చెదరు సతులుగ విలసిల్లి ప్రీతి | 9. |
తే.గీ. | రాజ పుత్రులు నల్వురు నోజ నొక్క దివసమున రాజకన్యల దీప్తముఖుల నల్వుర కరపద్మమ్ములఁ జెల్వముగ గ్ర హింతురు మహాబలులు సంయమీంద్రు లార! | 10. |
తే.గీ. | ఫల్గునుల నుత్తరంపు దివసము నందు దేవ! భగుఁడు ప్రజాపతి తా వెలయఁగఁ బరిణయమునకు మేలండ్రు పలికి యిట్లు నంజలించి లేచి మునుల కనియె నిట్లు | 11. |
ఆ.వె. | ఉత్తమంపు ధర్మ మొప్పుగ నా కొన రించితిరి పరమ మునీంద్రులార! నిత్య శిష్యుఁడ నని నే నెంతు మీకు వ రాసనమ్ము నందు నలరుఁ డిచట | 12. |
తే.గీ. | దశరథున కయోధ్య విధమ్ము తలఁప మిథిల యగును నాకుఁ బాలనమున నార్యులార! వలదు శంక మీ కిట నర్హ పథ మనంగఁ దోఁచినది యెల్లఁ జేయుఁడు తోరముగను | 13. |
కం. | సంతసము నంది మాటల కంత జనకుఁ డనఁగ నట్లు కరము పలికె స్వీ యాంతఃకరణమ్మున భూ కాంతుం డా దశరథుండు కమనీయముగన్ | 14. |
తే.గీ. | అన్నదమ్ము లిద్దఱు మిథిలాధిపతు ల మిత గుణ నిధాను లెంచఁగ మించి మీరు ఋషుల రాజన్యులను నిత్య మెలమిఁ బూజ సేయుదురు భక్తి మీఱంగ రాయలార | 15. |
తే.గీ. | స్వస్తి కల్గు భద్రమ్మగు విస్తృతముగ మీకుఁ బోయివచ్చెద మింక మీఱి శ్రాద్ధ కర్మములు సలుపఁగ నౌపకార్యల కని పల్కి దశరథుఁ డిక్ష్వాకు పార్థివుండు | 16. |
కం. | ఆమంత్రణము గొని నృపతి యా మిథిలాధిపతి నుండి యనురాగముతో నా ముని వరేణ్యు లిద్దఱఁ దా ముం దిడి వేగమ చనె దశరథుఁ డంతన్ | 17. |
ఆ.వె. | చని నిలయము రాజు శ్రాద్ధము జరిపించి శాస్త్ర విధిని నంత శ్రద్ధతోడ నుదయ మందు లేచి యుత్తమముగను గో దానముల నొసంగె దశరథుండు | 18. |
చం. | కులుకుచు లక్ష లక్ష వర గోవుల దాన మొసంగె వేద వి ప్రుల కట నొక్క యొక్క వర పుత్రున కై తగ రాఘవుండు వా రల కిల క్షేమ మేర్పడ ధరాపతి బంగరు కొమ్ము లుండ వ త్సల సహితమ్ము ప్రీతిని నొసంగెను బాలకుఁ గాంస్యపాత్రలున్ | 19. |
తే.గీ. | పుత్రుల కొఱకు నింపుగఁ బుత్ర వత్స లుండు గోదాన సహితమ్ము మెండుగ ధన ము నితరమ్ముల నొసఁగె విప్రులకు రాఘ వుండు దశరథుం డవని ధవుండు వెండి | 20. |
కం. | కృత గో దానుఁడు నందన వృత దశరథ రాజు వెలిఁగెఁ విశ్వేశ గణా వృత హర్షిత ప్రజాపతి గతి ముది తాత్ముం డయి యధికమ్ముగ నచటన్ | 21. |
ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు డెబ్బది రెండవ సర్గము.
బాలకాండము
సర్గము 73.
సీతారాముల కల్యాణ ఘట్టము. | ||
కం. | ఏ దిన మందు దశరథుఁడు గో దానమ్మును ద్విజులకుఁ గూర్మిఁ జలిపెనో యా దినముననె యుధాజితుఁ డాదరముగ నేఁగుదెంచె నాపురమునకున్ | 1. |
ఆ.వె. | భరతునకు స్వయముగఁ బరగెడు మేన మా మయును గేకయపతి ప్రియ తనయుఁడు గాంచి యడిగి యాతఁ డంచితముగ మహా రాజు క్షేమ మంత నోజఁ బలికె | 2. |
కం. | కేకయ దేశాధీశుఁడు మీ కుశలం బడిగె రాజ! మీఱిన ప్రేమన్ మీ కోరు వారును గుశల మే కాకుత్స్థ యిపుడు వసుధేశ్వర భృశమున్ | 3. |
ఆ.వె. | మేన యల్లుఁ గాంచ మేదినీశ! జనకుఁ డా మహీధవుండు ప్రేమ నిచ్చ గింప నేఁగితి వడి నెలమి నయోధ్యాపు ర వరమునకు నేను రాగ మడర | 4. |
చం. | వినితి నయోధ్య లోన నృప! వేడ్క సుతాలి వివాహ కార్యముల్ ఘన మిథిలా పురమ్మునను గ్రన్ననఁ జేయఁగ నేఁగి రంచు నే విని కన మేనయల్లు నిట వే యరుదెంచితి నంచుఁ బల్క నా విని తగ గౌరవించెఁ బతి ప్రీతి వరాతిథి గౌరవార్హునిన్ | 5. |
ఉ. | అంత వసించి రాత్రి యట నాత్మజు లెల్లరఁ గూడి ప్రీతి రా త్ర్యంతము నందుఁ గృత్యముల నందఱు వేగమ యాచరించి వే దాంతులు మౌని పుంగవుల నందఱ ముం దిడి చేరి రంత య జ్ఞాంతిక వాటికా తటికి నాదర మొప్పఁగ సంభ్రమమ్మునన్ | 6. |
ఉ. | చేతికిఁ దోరణమ్ములను జెల్వపు టాభరణమ్ము లుండఁగా భ్రాతలఁ గూడి యా విజయ పాటవ యుక్త ముహూర్త మందు సం ప్రీత మనస్కుఁ డార్యుఁడు వివేకుఁడు సేరి వసిష్ఠ తాపస వ్రాతము ముందు నుంచి తగ రాముఁడు నిల్చెను దండ్రి చెంతనున్ | 7. |
ఉ. | ఏఁగి వసిష్ఠుఁ డంత మిథిలేశుని పాలికి భూవరేణ్యుతో వాగమృతమ్ము లొల్క ననెఁ బార్థివ! మంగళ యుక్తుఁడై మహా భాగుఁడు రాఘవుండు క్రతు వాటికఁ జేరి సుతాలి తోడుతన్ బాగుగ వేచి యుండె నటఁ బంక్తిరథుండు ఘనార్హ దాతకై | 8. |
ఉ. | దాతయు గ్రాహకుండు సతతమ్మును నన్నిట వెల్గు చుండ్రు సూ ప్రీతి స్వధర్మ మింపుగను వేగమ సేయుమ యీ వివాహముల్ భూతల నాథ! నాఁ బలుకఁ బుణ్యతముండు వసిష్ఠుఁ డింపుగా నాతత ధర్మవేదుఁ డనె నా జనకుండు మహాత్ముఁ డిట్టులన్ | 9. |
ఉ. | ఎవ్వఁడు ద్వార రక్షకుఁడ యెవ్విధి మిమ్ముల నడ్డగించె మీ రెవ్వరి యాజ్ఞ గోరుటయు నేల స్వవేశ్మమ యంచుఁ దల్పుఁడీ యివ్వర దేశ మెంచ సత మింపుగ మీ ఘన దేశ రీతినిన్ నివ్వటిలంగఁ దల్పుఁ డెద నిత్యము రాఘవ! రాజపుంగవా! | 10. |
ఉ. | మంగళ కృత్యముల్ వరుస మా సుత లెల్ల రొనర్చివేదికిన్ ముంగలఁ జేరి రింపుగను బుణ్యమునీశ్వర! వహ్నికీల ల బ్భంగిని వేచు చుంటి నిటఁ బార్థివ! సిద్ధము సేసి యన్నిటిన్ భంగ విహీన మిచ్చట వివాహము సల్పుఁడు జాగు లేకయే | 11. |
కం. | జనకుని యా మాటలు విని ముని సహితమ్ము దశరథుఁడు పుత్రుల నెల్లన్ ఘనులను బ్రవేశ పెట్టెను మనమున హర్షం బొదవ సమంచిత రీతిన్ | 12. |
తే.గీ. | అంత వైదేహులు నృపులు సంతసమునఁ గని వసిష్ఠుని ధార్మిక! మునివరేణ్య! రాము పెండ్లి పనుల నభిరాముని విఁకఁ జేయుఁడు ఋషివరులఁ గూడి శీఘ్ర మనిరి | 13. |
కం. | అన విని వసిష్ఠుఁ డట్టులె యని విశ్వామిత్రు నింక నడరి శతానం దుని ముందుంచి ముని వరులఁ దనరెను సురనిభుఁడు సేయఁ దగు కార్యములన్ | 14. |
సీ. | చలిపందిరి నడుమఁ జక్కగ నిర్మించి వేది మహాముని విధిని గంధ పుష్పాదు లెల్లెడ మూరి జల్లి యలంకరించి సువర్ణమ యేద్ధ పాలి కా తతి ఛిద్రంపు ఘటము లంకుర సంయుతమ్ముల నుంచి స్రువమ్ము లింక స్రుక్కులు మూకుళ్లు చుట్టు నుంచి యగరు ధూపంపు పాత్రలు ధూప యుతము | |
తే.గీ. | శంఖ పాత్రలు పాత్రలు సజలముల న లంకరించె లాజాక్షతలను ఘటముల నించి సంస్కృతముల వేది నంచితముగ సంతసమ్మున నింకను సంయముండు | 15. |
తే.గీ. | సమపు దర్భలను బఱచి చక్క మంత్ర పూర్వకము వేది నగ్ని సముచిత మంత్ర వాచ్యముల నుంచి వెలిఁగించి భవ్యముగను వ్రేల్చె నేతి వసిష్ఠుండు వేదవిదుఁడు | 16. |
తే.గీ. | అంత సర్వాభరణ భూషి తాంగి సీత నగ్ని యెదుట రామునకు ముం దలరఁ జేసి వడినిఁ గౌసల్య కానంద మడరఁ జేయు రామునిఁ గని జనక మహారాజు మురిసి | 17. |
కం. | ఆతత గుణ జిత నారీ వ్రాతన్ భూజాత వస్త్ర వర సంవీతన్ భూతల నాథుఁడు పల్కెను సీతా సంజాతఁ జూపి సీతన్ నాతిన్ | 18. |
ఉ. | రామ! కడింది భద్ర మభి రాముఁడ! నీ కగు రమ్ము లెమ్మిఁకన్ రామ పతివ్రతాగణ లలామ మదాత్మజ సీత కేలు కెం దామర నీ కరాబ్జమునఁ దద్దయుఁ బ్రీతి గ్రహింపు మిత్తఱిన్ రామను ఛాయ నా నడచు రమ్యను నీ సహధర్మచారిణిన్ | 19. |
చం. | అని జనకుండు మంత్ర విమలాంబువు లల్లనఁ జల్ల మెల్లఁగన్ మునులును నిర్జరౌఘమును ముచ్చట పల్కిరి సాధు సాధు వం చు నలరి దేవ దుందుభులు చోద్యముగా వినిపించె మ్రోగఁగా ఘనముగఁ బుష్ప వర్ష మట గ్రద్దనఁ బాతిత మయ్యెఁ జెంతనున్ | 20. |
ఆ.వె. | ఒసఁగి మంత్ర సలిల యుత మట్లు సీతను సంతసమ్ము నంది యంతరంగ మందు జనకుఁ డా మహారాజు పల్కెను లక్ష్మణుఁ బరికించి లక్ష ణాంగు | 21. |
తే.గీ. | లక్ష్మణా రమ్ము భద్ర మలరును నీకు నూర్మిళా కరాబ్జమును నీ యుత్తమంపు హస్త నలినమ్ముచేఁ గొను మసవస యిసు మంత లేక పరమ హర్ష మడర హృదిని | 22. |
ఆ.వె. | పలికి యట్లు గాంచి భరతు ననియె నిట్లు రఘుకుమార నీ కర నలినమున సంగ్రహింపు మయ్య! చయ్యన మాండవీ హస్త పద్మ మీవు హర్ష మడర | 23. |
ఆ.వె. | జనకుఁ డంతఁ గాంచి శత్రుఘ్నునిఁ బలికె నో మహా భుజయుగ యొప్పుగ శ్రుత కీర్తి హస్త సుమము కృతమతి నీ హస్త పద్మమున గ్రహింపు భద్రముగను | 24. |
తే.గీ. | మీర లెల్లరు సౌమ్యులు వీర వరులు సచ్చరిత్రులు దారల సంయుతమ్ము దనర వలయు నాలస్యము తగదు మీకు నింకఁ గాకుత్స్థులార! నిశ్శంక నిపుడు | 25. |
చం. | జనకుని నాలకించి మునిచంద్రు వసిష్ఠు ననుజ్ఞ నల్వురున్ వనితల హస్త పద్మములు పాణుల నంత స్పృశించి యింపుగా ననలము చుట్టు తిర్గి రట నాలుల తోడుత రాజు సంయముల్ తనరిరి వారితో విధి యుతమ్ముగఁ జేసిరి పెండ్లి యచ్చటన్ | 26. |
తే.గీ. | అంతరిక్షము నుండి మహాద్భుతముగ రాఘవులు గ్రహింప మృదు కరమ్ములను గు రిసిరి పుష్ప వర్షమును మురిసి యమరులు వెల్గు లీన మిక్కుటముగ నాల్గు దిశల | 27. |
తే.గీ. | దివ్య దుందుభి స్వనములు భవ్య వాద్య గీతముల నచ్చరలు చెలఁగిరి కరమ్ము నృత్యములఁ బాడ గంధర్వ నిచయ మడరి రాఘవుల పెండ్లి నయ్యపూర్వ మగపడెను | 28. |
ఆ.వె. | చెలఁగఁ దూర్య ఘోషము లట ముమ్మారు ల గ్నికిఁ బ్రదక్షిణమ్ము నెమ్మిఁ జేసి బల పరాక్ర మోన్నతులు పరిణయమాడి రంత రాఘవులు వరాంగనలను | 29. |
కం. | చని రంత గుడారములకు ఘను లా రఘుతనయులు నిజ కాంతల తోడం గని సర్షి సబాంధవ మల రి నృపుఁ డనుసరించి వారి లెస్సగ వెడలెన్ | 30. |
ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు డెబ్బది మూడవ సర్గము.
బాలకాండము
సర్గము 74.
విశ్వామిత్రుఁడు హిమాద్రి కేఁగ దశరథుఁడు సపరివార మయోధ్యకుఁ బయన మగుట, జనకుఁడు కన్యా ధనము నొసఁగుట, ప్రయాణములో దశరథునకుఁ బరశురాముఁడు కనిపించుట. | ||
తే.గీ. | రేయి గడవ విశ్వామిత్ర ఋషివరుండు రాజుల యనుజ్ఞఁ గైకొని రాఘవులకు దీవన లొసంగి ప్రీతినిఁ దిరిగి యుత్త రాద్రి కేఁగెను వేగ బ్రహ్మర్షి యంత | 1. |
కం. | చన విశ్వామిత్రుఁడు జన క నృపతి యామంత్రణమునఁ గాకుత్స్థుం డం త నిజ నగరం బయోధ్యకుఁ జనం దొడఁగె హర్ష మడర స్వగణము తోడన్ | 2. |
తే.గీ. | వెడలు రాజు ననుగమించెఁ బుడమి ధవుఁడు జనకుఁడు విదేహ నాథుఁడు సమధికముగ నిచ్చి కన్యాధనమ్ము లనేక రూప ముల నెలమి వేరు వేరుగఁ బుత్రికలకు | 3. |
ఉ. | గోవులు వందవేలు మఱి కోటుల సంఖ్యను బట్టు వస్త్రముల్ వే వర కంబళమ్ములను బ్రీతి గజాశ్వ పదాతి కూబరుల్ వావిరి దాస దాసులను భవ్య సురూపల భూషితాంగులన్ భూవరుఁ డిచ్చెఁ దోరముగ ముత్యము లభ్రము విద్రుమమ్ములన్ | 4. |
తే.గీ. | ఇచ్చి హెచ్చుగ విత్తమ్ము సచ్చరితుఁడు మిథిలకుం బతి తా దశరథు ననుజ్ఞఁ గైకొని నరేశ్వరుం డంత వీఁక స్వీయ నిలయమున కేఁగె సంతస మలర నెడఁద | 5. |
ఆ.వె. | బలము లనుగమింప నెలమి సాకేత ధ వుఁడు మహాత్ములు వర పుత్రుల సహి తమ్ము సకల ముని గణమ్ము ముందు నడువ బయలు దేరె మూరి పార్థివుండు | 6. |
మ. | చనుచుండంగ సపుత్ర సర్షి తతి యా సాకేత నాథుం డటుల్ వినిపించెం బటు ఘోర రావములు ద్యోవీథిన్ విహంగధ్వనుల్ దనరెన్ జంతు ప్రదక్షిణమ్ము లదరన్ ధాత్రీ తలం బెల్లయుం గని ప్రశ్నించె వసిష్ఠు రాఘవుఁడు భూకాంతుండు విభ్రాంతుఁడై | 7. |
తే.గీ. | పక్కి కూతలు రోతలై పిక్కటిల్లెఁ దిరుగు చున్నవి మృగములు గిరగిర వడి నుత్త లమ్మహో చెలరేఁగెఁ జిత్త మందు నేమి యిది ఝల్లు మన గుండె లెల్ల దేవ! | 8. |
కం. | నా విని పల్కె వసిష్ఠుఁడు దేవ నిభుఁడు మునివరుండు తియ్య నయిన వా చ్యావలి దీని ఫలమ్మును భూవర వాక్రుచ్చెద వినుము రఘు వరేణ్యా! | 9. |
తే.గీ. | రాజ! సూచించు చున్నవి రావములు వి హగ ముఖముల వెలువడి భయంకరంపు దివ్య ఘటనము మృగముల తిరుగుడు తగు శాంతిఁ గానఁ దాపము వీడఁ జనును నీకు | 10. |
కం. | వా రట్లుండం బలుకుచు ఘోరమ్ముగ గాలి లేచెఁ గుదుపుచు ధాత్రిన్ భూరుహముల సకలముల న వారిత విధిఁ గూల్చు చుండి వరుస శుభములన్ | 11. |
చం. | తనరెను జీఁక టెల్లెడల దామర సాప్తునిఁ గప్పి దిక్కులుం దనరవు కాంతి పుంజములఁ దద్బల మెల్లను బూది చేత న య్యెను బరివేష్టితం బట నహీనము మోహిత మయ్యె మూర్ఛలో మునులు వసిష్ఠుఁ డా నృపతి పుత్రులు దక్క మునింగి రెల్లరున్ | 12. |
కం. | అట భస్మచ్ఛన్నమ్ముగఁ బటు సైన్యం బెల్ల నుండఁ బడి ధరఁ బెం జీఁ కటి క్రమ్మఁగ నల్దిశలన్ జటాధరుఁడు భీమ నిభుఁడు చయ్యన రాఁగన్ | 13. |
మ. | కనెఁ గాకుత్స్థుఁడు జామదగ్న్యు ఘన భూకాంతఘ్ను దుర్ధర్షునిం ఘన కైలాస నిభమ్ము దుస్సహ తనుం గాలాగ్నిసాదృశ్యునిం ఘన తేజో జ్వలి తాంగు నల్ప జన వీక్షా దూరు స్కంధస్థి తా రి నిరో ధోగ్ర కుఠారు భార్గవు ధనుర్విద్యోత బాహూత్తమున్ | 14. |
ఆ.వె. | త్రిపుర నాశ శివుని రీతి ముఖ్య శరము నూని వచ్చు వాని నుజ్జ్వలు నన లాభముగ వసిష్ఠు నాదిగ మును లెల్లఁ గాంచి యొండొరుల వచించి రిట్లు | 15. |
తే.గీ. | నిజ జనకు వధింప నలిగి నృపుల నెల్ల మున్ను హింసించి విగత కోపుండు విగత తాపుఁ డెంచఁడు గద రాజ దమన మిపుడు దిరిగి క్షత్రియ వధ తగ దరయ నంచు | 16. |
తే.గీ. | పలికి యర్ఘ్యము గొనితెచ్చి భార్గవు నతి భీమ దర్శను మును లెల్లఁ బ్రీతిఁ గాంచి యొసఁగి రామ రామ యనుచు నొయ్యనఁ బలి కిరి మధుర వచనమ్ములు కేలు మొగిచి | 17. |
కం. | కొని యర్చ ఋషు లొసంగఁగ ఘన విక్రమ జామదగ్ని కాంచి దశర థా వని నాథ సుతుని రాముని నిన కులవర్ధనునిఁ బలికె ని ట్లాతనితో | 18. |
ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు డెబ్బది నాల్గవ సర్గము.
బాలకాండము
సర్గము 75.
పరశురాముఁడు దశరథుని ప్రార్థనము గ్రహింపక దశరథ రామునితో శివ వైష్ణవ ధనువుల మహిమలను దెలిపి విష్ణు ధనుస్సు నెక్కుపెట్ట మని యట్లు సేయఁ గలిగిన రామునితో ద్వంద్వ యుద్ధము సేయఁ గలనని వచించుట. | ||
కం. | రామా! దాశరథీ! నీ యీ మగఁటిమి మేము వింటిమే యద్భుతమున్ భీమ ధనుర్భంగ మహో యా ముచ్చట వింటి మయ్య! యఖిలము రామా! | 1. |
ఆ.వె. | అద్భుతము ననూహ్య మా ధనుర్భంగము సేయ నీవు రామ! వే యిట కరు దెంచితిఁ గొని నితర దివ్యంపు విల్లును శుభతరమ్ము నేను జూడ నిన్ను | 2. |
కం. | ఇది యా విల్లు కనుమ జా మదగ్న్య మిది ఘోర నిభము మహి తాస్త్రమ్మే కుదురుగఁ గూర్పుమ శరమును బెదరక నీ బలముఁ జూపు పృథ్వీశ సుతా! | 3. |
తే.గీ. | విల్లు నెక్కిడ నీ దైన వీర్య మరసి వీరవరులకుఁ దగినట్టి ఘోర మైన నాదు ద్వంద్వ యుద్ధము నిత్తు మేదినీశ నందన! రఘుప్రవర! నీకు విం దనంగ | 4. |
కం. | అన విని యా వచనమ్ముల ను నృపుం డా దశరథుండు నొచ్చి భృశమ్మున్ ఘన దీన వదనుఁ డంజలి ననె శోకాక్రాంతుఁ డిట్లు నాతని తోడన్ | 5. |
చం. | విడువుమ క్షత్ర రోషమును విప్రవరేణ్య! మహాయశస్క! నా కొడుకులు బాలు రెల్లరకుఁ గూర్మిని నీ యభయమ్ము నిమ్ము నీ వడరెదు భార్గ వాన్వయము నందు మహాధ్యయనుల్ వరవ్రతుల్ బెడఁగిన వంశ మందు బలభేదిఁ దలంచుచు వీడి తస్త్రముల్ | 6. |
తే.గీ. | అట్టి నీవు ధర్మపరుఁడ వై యొసఁగితి భూమి కశ్యపునకు వనమునకు నేఁగి భార్గవ మహేంద్ర సన్నామ పర్వతమున నింపుగ నిలయ మ్మరసితి సొంపు మీఱ | 7. |
ఆ.వె. | నాదు విలయమున కనంగ వచ్చితి వీవు మునివరేణ్య! ఘనుఁడు పుత్రు లందు రాముఁ డొక్కఁ డకట లయమంద జీవింప నేర మెల్లర మిఁక నీదు కతన | 8. |
కం. | విని పలుకులు లక్షింపక ముని భార్గవుఁ డా నృపతిని మూరి వచించెన్ ఘను రఘురాముని వీక్షిం చి నిశితముగ విక్రముండు శీఘ్రమ యిట్లున్ | 9. |
ఉ. | ఈ ధను యుగ్మ ముద్ధతి మహీతల విశ్రుత కార్ముకమ్ములన్ బాధల కోర్చి చేసె దృఢ భద్ర బలాన్విత రాజితమ్ములన్ క్ష్మాధర సన్నిభమ్ములను గార్య విశారద విశ్వకర్మయే భూధవ పుత్ర రత్నమ! యపూర్వ విధమ్ముగ నైపుణమ్మునన్ | 10. |
తే.గీ. | సుర లొసంగి రందొక్కటి హరున కా త్రి నయనునకు నుత్సహింపంగ నరవరేణ్య! ద్రిపుర సంహర్తకుఁ జెలఁగి తివిరి నీవు విఱిచిన యది యచ్చోట నా విల్లె చుమ్ము | 11. |
తే.గీ. | రెండవ దిది హరి కొసఁగిరి సుర లలరి విల్లు దుర్ధర్ష మియ్యది వెలయు వైష్ణ వ ధను వనఁగఁ గాంతి యుతము పరిగణమ్ము సేయ శివ ధనుస్సదృశమ్ము చేవ లోన | 12. |
తే.గీ. | హరి హర బలాబలమ్ముల నరయ నమరు లంత నాసక్తి చెలఁగంగ నరిగి వినతి నలినసంభవు నడిగిరి నరవరేణ్య! పరమ కౌతుకమునఁ దెలుప వలయు నని | 13. |
కం. | అమరుల భావంబు నెఱిఁగి సముచితము సరోజభవుఁడు సత్వరము విరో ధముఁ గల్పించెను వారికిఁ బ్రముఖుఁడు సత్యవచనుల నరయ మోదమునన్ | 14. |
చం. | నెరప విరోధ మిద్దఱికి నేర్పున యుద్ధము రోమహర్షమై జరిగెను విష్ణుశంభులకు స్తంభితుఁ డయ్యెను జంద్రమౌళి యా హరి వడి హుంకరింప హరు నా ధను వత్తఱిఁ జాఁగె మిక్కిలిన్ గరువము విక్రమమ్ము చెడఁ గల్మష కంఠున కింక వింటికిన్ | 15. |
ఆ.వె. | చారణ సుర తాపస వర సంఘ మపుడు కలసి వచ్చి చక్కఁగ సుర ముఖ్యు లిద్దఱిఁ గని యనునయించి శాంతింపఁగఁ జేసి రంత వారిఁ జెలువముగను | 16. |
ఆ.వె. | జృంభితమ్ము కాఁగఁ జేవ తఱిగి శివు విల్లు భీమ విష్ణు విక్రమమున నట్లు గాంచి యెంచి రమరులు విష్ణు వ ధికుఁ డనఁగ నిరువురఁ దెల్లముగను | 17. |
కం. | అలుక నొసంగెన్ రుద్రుఁడు విలు బాణముతో విదేహ విభువరునకు భూ తల మందు దేవరాతున కల దాఁపఁగ భద్రముగ మహాత్ముం డంతన్ | 18. |
కం. | ఇది వైష్ణవ కార్ముకము ప ర దమన విశ్రుతము రామ! రమ్యము దీనిం బదిలముగ భార్గవ ఋచీ కు దరిని నా విష్ణు వుంచెఁ గూర్మి చెలంగన్ | 19. |
తే.గీ. | పుత్రునకు జమదగ్ని కమ్ముని యొసంగె నాదు తండ్రి కప్రతికర్మ నైపుణునకు జప తపోబలుఁ డుంచఁగఁ జాప వరము నర్జునుండు దుర్మతి చంపె నమ్మహాత్ము | 20. |
చం. | విని యతి దారుణంపు మృతి విప్రుని నా పితృ దేవు ఘోర హ త్యను భువి రాజు లందఱిని నంతము చేసి యనేక వారముల్ ఘనముగ భూమినిం బడసి కశ్యప సంయమి కిచ్చి దాన రీ తి నవభృథం బొనర్చి తగ దివ్య మహేంద్ర నగమ్ముఁ జేరితిన్ | 21. |
తే.గీ. | తగు తపోబ లాన్వితమునఁ దనర నచట రామ! వీర్య మడర ధనుర్భంగ మీవు సేయుట విని మహాబల! శీఘ్రమ యరు దెంచితి నిటకు వీక్షింప నెంచి నిన్ను | 22. |
కం. | ఇది యా వైష్ణవ ధనువు ల సదుత్తమము క్షత్రధర్మ సంచారివియై యిది పితృ పైతామహము బె డిదంపుఁ గార్ముకము సుమి వడి గొనుమ దీనిన్ | 23. |
కం. | పూరింపుమ యీ చాపం బారవ మెసఁగంగఁ బర పురాలిఘ్నమ్మున్ పూరించి తేని రామా! పోరాటము ద్వంద్వ మిత్తు మూరి భయదమున్ | 24. |
ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు డెబ్బది యేనవ సర్గము.
బాలకాండము
సర్గము 76.
రఘు రాముఁడు విష్ణు చాపము నెక్కు పెట్టి యది వ్యర్థము కాఁ గూడదు కానఁ బరశు రాముని కోరికపై నాతఁడు తపస్సుచే నార్జించిన లోకములను బాణము విడిచి లయము చేయఁ బరశురాముఁడు మహేంద్రగిరికిఁ దిరిగి వెడలుట. | ||
కం. | భార్గవ రాముని దర్పా నర్గళ గిరలు విని మన్నన జనకునకు నౌ మార్గము నెంచి యెడఁద నా భార్గవుతో రాముఁ డనియెఁ బన్నుగ నిట్లున్ | 1. |
కం. | వింటిని భార్గవ పుంగవ! తొంటిని మీ చేసి నట్టి తోరపుఁ బనినిం గంటివి పిత్రూణము వె న్నంటి నృపులఁ జంపఁ దీర నందుమ నుతులన్ | 2. |
కం. | అవమాన పఱచితివి భా ర్గవ! నన్నిట వీర్యహీన రాజాన్వయ సం భవ యుక్తపుఁ బనులకుఁ జా ల వని కనుమ నా బలం బలర నీ విచటన్ | 3. |
చం. | పలికి రఘూత్తముం డిటుల భార్గవు వింటి గ్రహించి క్రుద్ధుఁడై ములికినిఁ గూడి యంత మునిపుంగవు చేతుల నుండి యల్లెకుం జులుకనఁ బూన్చి బాణమును జోద్యము మీఱఁగఁ బల్కె నంతటం జెలువపు భాషణమ్ములను శీఘ్రమ భార్గవు తోడ నివ్విధిన్ | 4. |
తే.గీ. | బ్రాహ్మణుండవు గావునఁ బరమ పూజ నీయుఁ డవు నాకు మఱి దలపోయ నన్య కారణమ్ము విశ్వామిత్రు కతనఁ గలదు ప్రాణ హర శరమును వేయ రాదు నాకు | 5. |
తే.గీ. | నీ నడచు శక్తిని నయిన నీ తపంపు మహిమఁ బొందిన యప్రతిమంపు లోక సంచయమ్ముల నైనను సంయమీంద్ర! నే హరింపఁ జేయుదుఁ బల్కు నీదు వాంఛ | 6. |
కం. | పరపుర భంజన వైష్ణవ శరమ్ము దివ్యమ్ము వ్యర్థ శరముగ భువిలోఁ బరఁగఁ దగదు వీర్యమ్మునఁ బర దర్ప వినాశి విష్ణు వర ధను వెంచన్ | 7. |
మ. | కర పద్మస్థ మహోన్న తాయుధ నృపుం గాంచంగ సర్షివ్రజా సుర సబ్రహ్మ సురాలి సిద్ధగణ సచ్ఛుద్ధాత్మ గంధర్వ కి న్నర సిద్ధావలి యప్సరోగణ మహా నాగాలి సచ్చారణుల్ వర రక్షస్సులు నేఁగుదెంచి రల సంభావ్యుల్ మహాశ్చర్యమున్ | 8. |
ఆ.వె. | నిశ్చలమ్ము గాఁగ నిల్చె లోకమ్ములు ధనువు నెత్తి నంత నినకులేశుఁ డడరి వీర్యహీనుఁ డయ్యె నా జామద గ్ని కనుచుండె రాముని వదనమ్ము | 9. |
కం. | మెల్లఁగఁ బల్కెను వీర్యము డుల్ల నతని తేజపుం బటుత్వమ్మున న బ్బల్లిదుఁడు జడుం డయి తాఁ దల్లడిలుచు నిల్చి జామదగ్ని యతనితో | 10. |
తే.గీ. | కశ్యపున కిచ్చితిని మును గాశ్యపి వర దానముగ రఘురామ! యధ్వరపు టంత మందు నిందుండ వలదంచు నమ్మహాత్ముఁ డానతి నొసంగెఁ గైకొని దాన మలరి | 11. |
తే.గీ. | భూమి నెల్ల నొసఁగి కశ్యపునకు నపుడు ప్రతినఁ దగ నూని కాకుత్స్థ! పరమ నియతి ఘనుఁడు గురువర్యు మాటకుఁ గట్టుపడుచు రాతిరి వసుధ వసియింప రాదు నాకు | 12. |
చం. | గమనపు శక్తి వీరవర! కావున నాకు లయంబు సేయ రా దు మనుజముఖ్య! హర్షమునఁ దూర్ణము పోవ మహేంద్ర శృంగికిన్ సముచిత రీతి లోకముల సత్య తపఃఫలితమ్ము లయ్య జం పుమ వడి జాగు సేయకుమ మూరి శరమ్మునఁ బద్మలోచనా! | 13. |
తే.గీ. | నిన్నెఱిఁగితి ధనుస్స్పర్శ నీరజాక్ష! యక్షయఁడవు నిర్జర పతి వంచు మధు ని షూదనుఁడ వంచు నెమ్మది క్షుణ్ణముగను స్వస్తి నీకుఁ బరంతప! సదమలాత్మ! | 14. |
కం. | సురవరులు చూచు చుండిరి గురు కర్మ ధురంధరుండ! కూడి సమర మం దరి వీరోగ్రుఁడ వప్రతి వర విక్రముఁడవు గుణాభివంద్యుని నిన్నున్ | 15. |
కం. | లజ్జింపంగ ననర్హుఁడ నిజ్జగతి రఘూద్వహుండ నే నోడంగన్ ముజ్జగముల విభునకు నా యుజ్జ నరయ రఘువరేణ్య! యుద్ధము నందున్ | 16. |
కం. | విడువుమ బాణము వేగమ తడ వేమిటి కింక రామ తామర సాక్షా! కడు వడి నేఁగెద గిరికిం దడఁబడక మహేంద్రమునకుఁ దద్దయుఁ బ్రీతిన్ | 17. |
కం. | అన జామదగ్ని రాముఁడు విని రాముఁడు దాశరథి సువిక్రముఁ డంతన్ ఘనశిత శరమ్ము వే విడి చెను శ్రీమంతుం డపుడు విశేషపు మహిమన్ | 18. |
కం. | శరఘాత లోకములు నిజ పరమ తపోలబ్ధములను భార్గవుఁ డీక్షిం చి రయమున మహేంద్ర గిరికిఁ దరలెను బ్రీతి వర పర్వతమునకు నంతన్ | 19. |
ఆ.వె. | అంత నంధకార మణఁగె దిశోప ది శలను సర్షి సుర నిచయము పొగిడె నుద్యదాయుధుని సముచితముగ రఘు రా ము నెలమి భృశముగ నపూర్వ కర్ము | 20. |
కం. | రాముండు జామదగ్ని మ హా ముని విభుఁడు నుతియించి యద్ధాశరథిన్ రామునిఁ బ్రదక్షిణం బభి రామున కొనరించి యేఁగె రతి నిజ గతికిన్ | 21. |
ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు డెబ్బది యాఱవ సర్గము.
బాలకాండము
సర్గము 77.
పరశురాముఁడు శాంతిఁ బడసి వెడలి నంత రఘురాముఁ డా గొప్ప ధనుస్సును వరుణుని చేతి కిచ్చుట, యంత నందఱు నయోధ్యకుఁ జేరు కొనఁగఁ గౌసల్యాది రాణు లందఱు కోడండ్ర నంతః పురమునకుఁ గొనిపోవుట, భరత శత్రుఘ్నులు మేనమామ యుధాజిత్తునితోఁ గేకయ రాజ్యమున కేఁగుట, రామ లక్ష్మణులు తండ్రికి రాజ కార్యములఁ దోడుండుట, సీతారాము లానందముగ విహరించుట. | ||
కం. | చన భార్గవుం డెడఁద శాం తినిఁ బొంది తగ రఘువంశ తిలకుం డంతన్ ఘనమౌ యా ధనువును వరు ణుని హస్తం బందు నుంచెను ముదం బారన్ | 1. |
చం. | వినయముతో వసిష్ఠ ముఖ విజ్ఞ మునీంద్రుల కెల్ల మ్రొక్కి తం డ్రినిఁ గని విహ్వలాత్ము ననె శ్రీరఘు రాముఁడు భార్గవుండు వే చనెఁ జతురంగ సైన్య మిఁకఁ జక్క నయోధ్యకు నేఁగ నిండు మీ రనుమతి సేనకుం బతిగ నందఱ మేఁగఁగ సమ్మదమ్మునన్ | 2. |
కం. | నిలిచెను ధ్వజిని యనుమతికి జలార్థ మా చాతకముల సరణి నరేంద్రా! లలితముగ నిచట గనుఁడీ కలవర మేల యొసఁగుఁడు తగ ననుజ్ఞ వడిన్ | 3. |
ఉ. | రాముని భాషణమ్ములను రమ్య తరమ్ముల నాలకించి యా రామునిఁ కౌగిలించియు శిరమ్మున ముద్దిడి సంతసమ్మునన్ రాముని పోక నవ్విధి కరమ్మిడ హర్షము తల్చె నిట్టులన్ రాముని గూడి నే నిట వరమ్మన గాంచితి జన్మ మన్యమున్ | 4. |
ఆ.వె. | సేన కంత నిచ్చె నానతిఁ గదలంగ వేగ పురికి రాజు ప్రీతి మీఱ దశరథుండు కదలఁ ద్వరితమ్ము సైన్యమ్ము కని రయోధ్య నెదుటఁ గన్ను లలర | 5. |
చం. | ఎగురఁ బతాకముల్ వరుస నిమ్ముగ మ్రోగఁగ వాద్యఘోషముల్ తగఁ బథ పంక్తిఁ జల్లఁగ నుదమ్ము ఘనమ్ముగఁ బుష్ప రాశియే యగపడ నెల్లెడం జెదరి యప్పుర వాసులు మంగ ళార వా ళి గిరల స్వాగతింపఁగ సలీల నరేంద్రుఁడు సేరె నప్పురిన్ | 6. |
తే.గీ. | నగర వాసులు పౌర జనమ్ములు ద్విజ గణ యుతం బెదురు చనఁగ ఘనులు తనయు లనుగమింప శ్రీమంతుఁడు నవని ధవుఁడు సేరె హిమవన్నగ నిభ విశిష్ట గృహము | 7. |
తే.గీ. | రాజు స్వజనముఁ గూడి కరమ్ము సంత సించె నిజ మనోరథములు చెలఁగి తీర వధువులఁ గొనిరి కౌసల్య వడి సుమిత్ర సుదతి కైక యన్య సతులు సురుచిరముగ | 8. |
తే.గీ. | సీతను సుమహాభాగను నాతి యూర్మి ల నిఁక మాండవి శ్రుతకీర్తుల ననునయము గ నలువురను బ్రీతిఁ గొనిరి కాంత లెల్ల నృప సతీమణు లా రాజ గృహములకును | 9. |
తే.గీ. | మంగళద్రవ్యములు గొని యంగనా మ ణు లిఁకఁ బట్టు వస్త్రమ్ములను ధరియించి భక్తి దేవాలయము లందు భవ్యముగను బూజలు సలిపి రెల్లరు ముదము మీఱ | 10. |
చం. | ప్రమదలు మ్రొక్కి మ్రొక్కఁ దగు వారికి నమ్రత రాజనందనల్ తమ తమ యిండ్ల కేఁగి వనితామణు లంతఁ గుబేర వేశ్మ తు ల్యములకు గోవులన్ ధనములం దనియంగ ద్విజాలిఁ జేసి స వ్యముగ నిజాత్మ నాథులను బన్నుగఁ గూడి సుఖించి రింపుగన్ | 11. |
చం. | సుతులు ఘనుల్ మహాత్ము లతి శూర వరేణ్యుల నుత్తముల్ భువిన్ సతులను గల్గి యస్త్ర సువిశారదు లెల్లరు విత్త వంతులున్ నుత సఖ సంచయాన్వితులు నొవ్వు లెఱుంగక తండ్రి నింపుగన్ సతతము కొల్చు చుండి నర సత్తము లుండిరి రాజనందనుల్ | 12. |
చం. | కడవఁగఁ గొంత కాలము సుఖమ్ముగ భూతల నాథుఁ డింపుగాఁ గొడుకునిఁ గాంచి యా భరతుఁ గూర్మినిఁ బల్కెను గైకయీ సుతున్ వడిఁ గొనిపోవ నిన్నటకు వచ్చెను నెమ్మి యుధాజితుండ యి క్కడకుఁ ద్వదీయ మాతులుఁడు గాంచుమ కేకయ రాజపుత్రుఁడే | 13. |
తే.గీ. | మిథిల లోన నన్నర్థించె మేనమామ ఋషుల మధ్య నట్లు నతని కింపు కొలుపఁ దగుదు వీవు పుత్రక! సమ్మదముగ ధర్మ విదుఁడ వట్లు దొడఁగు మింకఁ బదిలముగను | 14. |
మ. | విని యా మాటలు వల్కఁ దండ్రి భృశ సంప్రీతిం గుమారుండు స ద్వినయుండౌ భరతుండు రాముఁ బరిరంభించెం దమిన్ లక్ష్మణుం దన తండ్రిన్ మఱి తల్లి నన్న నట యుక్తంబౌ యనుజ్ఞం దగం గని యర్థించి చనంగఁ జాగె ననుజుం గాంక్షించి శత్రుఘ్నుతో | 15. |
ఆ.వె. | చన భరతుఁడు రామచంద్రుఁడు లక్ష్మణుం డతి బలుండు నిరువు రతి వినయము తోడఁ దండ్రి సతము తోరము సేవించు చుండి దేవ నిభుని నుండి రెలమి | 16. |
కం. | జనకుని యాజ్ఞ వహించి త గిన రీతి రఘూత్తముండు కెరలుచు మిగులం బనులను బౌరజన హితము లను బ్రియములఁ జేయు చుండె రాముం డెలమిన్ | 17. |
ఆ.వె. | మాతలకు సతమ్ము మాతృ కార్యము లొన రించుచు వినయమున నంచితముగ గురువులకుఁ జెలంగి గురుకార్య కాయము నెమ్మి పర్యవేక్షణమ్ము సేయు | 18. |
కం. | ఇవ్విధ మగు రఘురాముని యవ్వర వృత్తమ్ము గాంచి యవనీశుండున్ దవ్వుల దేశ నివాసులు నవ్విప్ర పురజను లుండి రానందమునన్ | 19. |
కం. | సకల ప్రాణి సమూహము నకు భువన చయమ్మునందు నలినజు భంగిన్ ప్రకటిత సత్యపరాక్రముఁ డు కన్పడె నినకుల రాముఁడు పురజనులకున్ | 20. |
కం. | కడపెను బెక్కు ఋతువులును బడతిన్ సీతను మనస్విఁ బన్నుగ నిడి తా నెడఁదన్ నిత్యము రాముఁడు కడు ముద మూని విహరించెఁ గాంతామణితో | 21. |
తే.గీ. | సీత మదిలోనఁ గాంతుఁడు ప్రీతి ద్విగుణ మై విరాజిల్లు చుండు వా రంతరాత్మ లోనఁ బొడఁజూపి నవియును లోన నుంచ కుండ నుందురు జెప్పుచు నండఁ జేరి | 22. |
తే.గీ. | రాము నాత్మ లోన నిలిచి భూమితనయ సీత దేవతా సన్నిభ శ్రీసతి వలె రూప మందుఁ జెలంగెడి నా పడఁతుక కరము ప్రీతయై నిత్యము పరఁగు చుండు | 23. |
తే.గీ. | అతఁడు రాజర్షి నందనుఁ డామె యుత్త మంపు రాజకన్యామణి యింపు మీఱ వారు కలసి వెలింగిరి శ్రీ రమా స తీ మతల్లి విష్ణువు లన దివ్యముగను | 24. |
మ. | రణ దుర్భేధ్య మహాస్త్ర శస్త్ర చయ పూర్ణ జ్ఞాన వన్నిత్య ల క్ష్మణ సంసేవిత తృప్త చిత్త! కరుణా సంవీత సంవీక్షణా! గుణ టంకార పరాజి తారి! సత తాక్షో భ్యాంతరంగా! లస ద్గుణ ధారా విలసచ్చరిత్ర! రిపు జిత్కోదండ రామప్రభూ! | 25. |
కమల విలసితము. | దశరథ తనయ! సదమల చరిత్రా! కుశలవ జనక! సుగుణ గణ ధామా! శశినిభ ముఖ! హరి సదృశ సుమధ్యా! దశముఖ విదళన! ధరణిజ నాథా! | 26. |
మాలిని. | సకల సుగుణ ధామా! శత్రు సంహార కార్యా! సకల కలుష విధ్వంసా! దయాంభోధి రామా! సకల విబుధ సంరక్షా! స కోదండ హస్తా! సకల భువన రక్షాసక్త చిత్తా! నరేంద్రా! | 27. |
ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున బాలకాండ మందు డెబ్బది యేడవ సర్గము.
శ్రీమదాంధ్ర రామాయణము నందు బాలకాండము సమాప్తము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి